జగన్ కేంటి. బంపర్ మెజారిటీతో గెలిచిన వీరుడు. తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించి దాని చోటు చూపించి పంపించిన శూరుడు. చంద్రబాబుకు ఇప్పటిదాకా దక్కని ఘోర పరాభవాన్ని చవిచూపించిన ఘనాపాటి. ఇక ఏడాదిగా పాలన రంజుగా చేస్తూ సంక్షేమ  మంత్రాన్ని వదలకుండా ముందుకు  సాగుతున్న ప్రజానాయకుడు.

 

మరి జగన్ ఎందుకు నచ్చడంలేదు. జగన్ కి ఏమైంది అంటే. ఫ్యాన్స్ మాత్రం జగన్ పాలన భేష్. ఆయన దూరద్రుష్టి భేష్. కానీ జగన్ రాజకీయంగా నెమ్మదించారు. ఆయన దూకుడు పెంచాలి అంటున్నారు. విపక్షాలు ఏమీ కాకుండా జగన్ని తీసిపారేస్తూంటే ఫ్యాన్స్ కి తెగ బాధగా ఉంటోందిట.

 

పొరుగున తెలంగాణాలో ఉన్న సీఎం కేసీయార్ ప్రతిపక్షంలో చెడుగుడు ఆడేస్తున్నారు. ఆ విధంగా జగన్ కూడా వారిని కట్టడి చేయాల్సింది పోయి ఎప్పటికపుడు  వారు వేసే బ్రేకుల్లో రెండు కాళ్ళు పెట్టి ఆగిపోతున్నారని బాధపడుతున్నారు. నిజానికి జగన్ పనితీరు జనాలకు నచ్చుతోంది. కానీ దానితో పాటే జగన్ నోరు కూడా గట్టిగా చేసుకోవాలని కోరుతున్నారు.

 

జగన్ మౌనంగా ఉండడమే విపక్షాలకు సయ్యాటగా మారినని, ప్రతీదానికీ జగన్ని విమర్శిస్తున్నారని  ఫ్యాన్స్ తెగ బాధపడుతున్నారు. నిజమే వైసీపీ కార్యకర్తలకు జగన్ని ఏమైనా అంటే బాధగానే ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో అది సహజం. కానీ ఏపీలో మాత్రం శ్రుతి మించి విపక్ష రాజకీయం సాగుతోంది. జగన్ విపక్షంలో ఉన్నపుడూ వారంతా ఒక్కటిగా ఉన్నారు. ఇపుడు జగన్ అధికారంలోకి వచ్చినా కూడా అంతా కలసి ఒక్కటిగా మూకుమ్మడి దాడిచేస్తున్నారు.

 

ఇకపైన జగన్ కూడా కనీసం నెలకు ఒక రోజు అయినా మీడియా సమావేశం పెట్టి తమ ప్రభుత్వం చేస్తున్నది ఇదీ అని జనాలకు వివరించగలగాలి. అదే సమయంలో విపక్షం చేసే తప్పుడు ఆరోపణలు ఎండగట్టాలి.  లేకపోతే ఈ సౌండ్ పొల్యూషన్ ఏ ఏటికి ఆ ఏడు పెరిగిపోతుంది. అపుడు జగనే అభిమానుల కంటే కూడా ఎక్కువగా ఇబ్బంది పడాల్సిఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: