ఈ మద్య మనుషులు మృగాలకన్నా కృరంగా మారుతున్నారు. ఒకదశలో వీళ్లకన్నా కృరమృగాలే నయం అనిపిస్తుంది.. ఎందుకంటే వాటికి ఆకలైనప్పుడు మాత్రమే వేటాడి తింటాయి.  కానీ సభ్యసమాజంలో కొంత మంది మనుషులు ఎప్పుడు పడితే అప్పుడు ఆకలితో ఉన్నట్లు కృరంగా ప్రవర్తిస్తున్నారు.  ఇక ఆడవాళ్లపై లాంటి దారుణాలు జరుగుతున్నాయో ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం.  దేశంలో కరోనా ఉంది.. లాక్ డౌన్ కొసాగుతుంది.. అయినా కూడా కొంత మంది మానవ మృగాలు ఆడవారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు.. హత్యలకు తెగబడుతూను ఉన్నారు.  ఇదిలా ఉంటే వన్యప్రాణుల వేటలో కూడా ఈ మద్య కొన్ని దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.

 

ఈ మద్య కొంత మంది విద్యార్థులు ఓ కుందేలు ని వేటాడుతూ... దాన్ని టిక్ టాక్ వీడియో చేసి పోస్ట్ చేశారు.  తాజాగా కడుపుతో ఉన్న హిమాలయన్ బ్లాక్ బేర్ జాతి ఎలుగుబంటిని కొందరు దారుణంగా చంపేశారు. అది కడుపుతో ఉందని తెలిసి కూడా దుశ్చర్యకు తెగబడ్డారు. చంపేసిన తర్వాత దాని చర్మం ఒలుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ బిడ్డకు ప్రాణం పోసే సమయంలో ఏ తల్లిని చూసినా ఎంతో గౌరవం కలుగుతుంది.  కానీ ఈ మానవ మృగాలు మాత్రం ఏ దయా లేకుండా దారుణంగా ప్రవర్తించారు.  

 

పైగా తామేదో ఘనకార్యం చేస్తున్నట్టు వీడియోలు, ఫోటోలు తీసి ప్రచారం చేయడంతో  పోలీసులు ఒకడిని అరెస్ట్ చేశారు. మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.  పైనూర్ల్సా సబ్ డివిజన్ మాపితూహ్ గ్రామంలో ఈ నెల 4న వేటకు వెళ్లి ఎలుగును చంపేశారు. కాగా, అరుదైన జంతువులను చంపితే కఠినంగా శిక్షిస్తామని అటవీ శాఖ మంత్రి లాక్మెన్ రింబుయ్ చెప్పారు. అధికారులు, పోలీసులు లాక్ డౌన్ విధుల్లో బిజీగా ఉండడంత వేటగాళ్లు ఇష్టారాజ్యంగా ప్రాణులను బలితీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: