దేశంలో కరోనా ఫిబ్రవరి నుంచి మొదలైంది. అప్పటి నుంచి వివిధ రాష్ట్రాల్లో తన ప్రతాపాన్ని చూపిస్తూ.. మెల్లి మెల్లిగా తెలుగు రాష్ట్రాల్లో తన ప్రతాపాన్ని చూపిస్తుంది.  ఇప్పటికే తెలుగు రాష్ట్రాలో కరోనా కెసులు వేయ్యి సంఖ్య దాటాయి.  నేడు కూడా మరో 60 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 24 గంటలలో 7,782 మంది శాంపిల్స్‌ ను పరీక్షించగా అందులో అరవై మందికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో ఏపిలో కరోనా భాధితుల సంఖ్య 1,777 కు చేరుకుందని ఏపి వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఏపిలో ఎక్కవగా కర్నూల్, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఈ మాయదారి కరోనా ఎక్కువ వ్యాప్తి చెందుతుంది.. మరణాలు కూడా ఇక్కడే ఎక్కువ సంబవించాయి.  

 

మొన్నటి వరకు శ్రీకాకుళం, విజయ నగరం లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ ఈ మద్య శ్రీకాకుళంలో కూడా కరోనా కేసుల మోత మోగాయి. ప్రస్తుతం ఏపిలో   కర్నూలు జిల్లాలో 17, కృష్ణా లో 14, గుంటూరులో 12 కడపలో 1, విశాఖ పట్నంలో 2, కేసులు నమోదు అయ్యాయి. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారిలో 13 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.   ఇదిలా ఉంటే.. మొన్నటి వరకు అన్ని జిల్లాలు ఒకవైపు మా జిల్లా ఒకవైపు అంటూ గంభీరాలకు పోయిన  విజయనగరం జిల్లా ఇప్పుడు ఒక్కసారే ఉలిక్కపడింది. అక్కడ కూడా తొలిసారి కోవిడ్ కేసు నమోదైంది.  

 

బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెకు ఇదివరకే కిడ్నీ సమస్య ఉంది. దీంతో విశాఖ పట్నం వెళ్లి చికిత్స తీసుకుంది. అక్కడి వైద్యుల కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ అని వెల్లడైంది.  అధికారులు ఆమెకు ఐసొలేషన్ లో ఉంచి కోవిడ్ చికిత్స అందిస్తున్నారు. కొడుకులు ఇటీవల వేరే ఊర్లకు వెళ్లొచ్చారని, వారి ద్వారా ఆమెకు కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆమె కుటుంబసభ్యులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: