భార‌త్‌ను నేరుగా ఎదుర్కొలేని పాకిస్థాన్ సైన్యం అందుకు ఉగ్ర‌వాద సంస్థ‌ల‌ను ప్రొత్స‌హిస్తున్న విష‌యం అనేక మార్లు రుజువైంది. పాకిస్థాన్ సైన్యంచే పోషించ‌బ‌డుతున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ భారత్‌లో దాడులకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా భార‌త్‌పై దాడులు చేసేందుకు ఈ సంస్థ అఫ్గ‌నిస్థాన్‌లోని ఉగ్ర‌వాద శిబిరాల్లో దాదాపు 400మందికి శిక్ష‌ణ ఇస్తున్న‌ట్లు ప‌క్కా ఆధారాలు ల‌భించ‌డం గ‌మ‌నార్హం.  భారత్‌లో దాడులకు పాల్ప‌డేందుకు ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌ వేదికగా ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఆఫ్ఘన్‌లోని తాలిబాన్‌ ఉగ్ర శిభిరాల్లో నలుగు వందల మంది జైషే ఉగ్రవాదుల్ని మోహరించింది.


త్వ‌ర‌లో వీరందర్నీ భారత్‌లోని కశ్మీర్‌ లోయకు పంపేందుకు ప్ర‌ణాళిక‌తో ఉన్న‌ట్లు ఆఫ్ఘన్‌ భద్రతా బలగాలు పసిగట్టాయి. గత నెలలో జరిగిన ఓ ఉగ్రదాడిలో పాక్‌కు చెందిన పలువురు ఉగ్రవాదుల్ని ఆఫ్ఘ‌న్  ఆర్మీ భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అదుపులోకి తీసుకోవ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వాస్త‌వానికి  కొద్దిరోజుల క్రిత‌మే దేశంలోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ ప్రేరేపిత అఫ్ఘానిస్థాన్‌ మిలిటెంట్లు దాడులకు తెగబడే అవకాశముందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు చేసిన హెచ్చరికలతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాకిస్థాన్ ఉగ్ర‌వాదులను, ఆఫ్ఘనిస్థాన్ మిలిటెంట్లను పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతమైన లిపా లోయలోకి పంపాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది.


అయితే లిపా లోయ నుంచి యూరి, తంగధర్ సెక్టార్ల మీదుగా ఆఫ్ఘాన్ మిలిటెంట్లు కశ్మీర్ లోకి చొరబడి దేశంలోని కశ్మీర్ లోయతోపాటు దేశ రాజధాని నగరమైన ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రాల్లో దాడులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని కేంద్ర ఇంటలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కశ్మీర్ లోయ, న్యూఢిల్లీతోపాటు గుజరాత్, మహారాష్ట్రాల్లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ హైఅలర్ట్ ప్రకటించింది. పాకిస్థాన్ లోని బాహవాల్ పూర్ లో జరిగిన జైషే మహ్మద్ కమాండర్ల సమావేశంలో  భారతదేశంలో ఆఫ్ఘాన్ మిలిటెంట్లతో దాడులకు వ్యూహరచన చేశారని కేంద్ర ఇంటలిజెన్స్ కు సమాచారం అందింది.  అయితే జైషే కుట్రల్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. దీంతో మరో వేదికగా భారత్‌పై కుట్రలకు తెరలేపినట్లు తెలుస్తోంది.

 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: