కరోనా వైరస్ కారణంగా చాలామంది అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేద మరియు మధ్యతరగతి ప్రజలు ఉద్యోగాలు చేసుకోలేక ఉపాధి లేక కుటుంబాన్ని పెంచి పోషించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో చాలామంది ప్రముఖులు  ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ భారీ విరాళం ప్రకటించింది. కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి ఏపీ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ మేనేజిమెంట్ అసోసియేషన్ రూ. 2,56,00,000/- విరాళం . విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైయస్ జగన్‌కు అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ మేనేజిమెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ప్రతినిధులు ఆలూరు సాంబశివారెడ్డి, ఆరిమండ వరప్రసాద్ రెడ్డి, మిట్టపల్లి కోటేశ్వరరావు, దాడి రత్నాకర్ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా సీఎం సహాయనిధికి నిడదవోలు ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు, నియోజకవర్గ నాయకులు, అభిమానులు రూ. 1,00,29,000/- విరాళం. సీవీఎస్‌ కృష్ణమూర్తి తేజ చారిటీస్ తరపున రూ. 25,00,000/- విరాళం ప్రకటించడం జరిగింది.

 

ఈ సందర్భంగా చెక్కు డీడీలు సీఎం జగన్ కి నిడదవోలు ఎమ్మెల్యే అందజేశారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నియోజకవర్గ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డాక్టర్స్ నాయకులు రూ. 89,86,222/- విరాళం కలిగిన చెక్కును సీఎం జగన్ కి అందించారు. ఈ సందర్భంగా జూనియర్ జగన్ వర్గానికి సంబంధించి వైసీపీ నాయకులు పాల్గొనడం జరిగింది. చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్లు కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: