వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎక్కడా కూడా పబ్లిసిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా తాను తలచిన పని సంక్షేమం పేదవాడి దాకా చేరుతుందో లేదో అన్న దాని విషయం గురించి పట్టించుకుంటారు. అయితే ఈ విషయంలో చాలామంది మీడియాతో కూడా కలిసి పనిచేయాలని ప్రభుత్వం ఏం చేస్తుందో మీడియాకి కూడా తెలిస్తే బాగుంటుందని అంటున్నారు. కానీ వైయస్ జగన్ మాత్రం గత ప్రభుత్వం లాగా తాను కల్లబొల్లి కబుర్లు చెప్పే మనిషిని కాదని...ప్రభుత్వం చేసే పని డైరెక్టుగా ప్రజల దగ్గరకు చేరితే చాలు మధ్యలో మీడియా అవసరం లేదని అంటున్నారు. అయితే ఈ విషయంలో పార్టీలో ఉన్న కొంతమంది సలహాదారులు అదేవిధంగా పెద్దలు ఇలా అయితే కొద్దిగా రిస్క్ అవుతుందని అంటున్నారట.

 

కానీ వైయస్ జగన్ మాత్రం రెస్ట్ తీసుకోవటమే బెటరని...మనం ఏం చేస్తున్నామో ప్రజలకు తెలిస్తే సరిపోతుంది తప్ప అనవసరమైన హడావిడి మీడియా వల్ల మనకు వేస్ట్ అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. మరో పక్క ఏపీ లో ఉన్న మీడియా ఎక్కువగా టిడిపికి ఫేవర్ గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి సమయంలో ఇటీవల లాక్ డౌన్ మూడో దశ విధించిన మద్యం షాపులు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం పర్మిషన్ ఇవ్వడం జరిగింది.

 

ఈ క్రమంలో మద్యపాన నిషేధం అని ముందు నుంచి చెప్పిన వైయస్ జగన్ కేంద్రం ప్రకటించిన తర్వాత రోజే వైన్ షాపు లు ఓపెన్ చేయడం తో మీడియా తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోసింది. అలాగే ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు కూడా నిజంగా జగన్ కి మద్యపాన నిషేధం చెయ్యాలని ఉందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోపక్క రాష్ట్ర ఖజానా కి డబ్బులు రావాలంటే ఇటువంటి సమయంలో జగన్ రెస్ట్ తీసుకోవటమే బెటర్ అని మద్యం షాపులు ఓపెన్ చేయడం కరెక్టే అని వైసీపీ పార్టీలో కొంతమంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: