జగన్ రాజకీయ అనుభవం పదేళ్ళు. ఆయన ముఖ్యమంత్రిగా ఈ నెలాఖరుకు తొలి ఏడాది జరుపుకోబోతున్నారు. జగన్ పదేళ్ళ సీఎం కల గత ఏడాది తీరింది. జనం బంపర్ మెజారిటీ కట్టబెట్టి జగన్ కి జై కొట్టేశారు. కానీ ఈ ఏడాది కాలం జగన్ కి మొత్తం కష్టాల సినిమా చూపించేసింది.

 

జగన్ పదేళ్ళుగా కష్టాలు పడుతూనే ఉన్నారు. సీఎంగా కూడా ఇంకా కొత్త సవాళ్ళు ఎదుర్కొంటున్నారు. అధికారం దూరమై, వయోభారమైనా కూడా చంద్రబాబు ఇస్తున్న ఝలక్కులు అన్నీ ఇన్నీ కావు. జగన్ని సీఎం సీట్లో ఒక్క నిమిషం కూడా మనశ్శాంతిగా కూర్చోనివ్వకూడదని డిసైడ్ అయినట్లుగా బాబు అండ్ కో వైఖరి ఉంది.

 

ఇక ఇసుక రాజకీయంతో మొదలుపెట్టి, ఇంగ్లీష్ మీడియం మీద పగపట్టి, మూడు రాజధానుల మీద దండెత్తి, పంచాయ‌తీ భవనాలకు వైసీపీ నేతలు  రంగులు వేశారంటూ రంగు రంగు రాజకీయాన్ని చూపిస్తూ ఆఖరుకు లోకల్ బాడీ ఎన్నికల్లో చేసిన రాజకీయం ఒక ఎత్తు. ఇక కరోనా సమయంలో కూడా ఆగకుండా చేస్తున్న అసలైన రాజకీయం పరాకాష్ట.

 

చిత్రమేంటంటే ఈ రాజకీయంలో సీపీఐ లాంటి పార్టీ కూడా పాలుపంచుకోవడం. సీపీఐ అయినా వామపక్షాలు అయినా ప్రజల మేలు కోరుకుంటాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో జగన్ విలీనం చేశారు. అదే విధంగా అశా వర్కర్ల నుంచి అందరికీ జీతాలు పెంచారు. ఇవన్నీ చూసినపుడు వాపక్షాలు కొంత అయినా నిర్మాణాత్మకమైన పంధాను అనుసరించాలి. కానీ సీపీఎంని పక్కన పెడితే సీపీఐ విమర్శలు బాధాకరమని వైసీపీ నేతలు అంటున్నారు.

 

ఎన్ని చేసినా, ఏమీ జరిగినా కూడా జగన్ కి ఇవన్నీ అనుభవాలేనని అంటున్నారు. జగన్ కి తొలి ఏడాది పూల పానుపులా గడచి మిగిలిన కాలమంతా కష్టాలు ఎదురైతే అదే అసలైన ఇబ్బంది కానీ, ఇపుడు జగన్ అన్ని విధాలుగా రాటుదేలారు అని ఆయన ఇక మీదట నాలుగేళ్ళలో మరింతగా శక్తిని పుంజుకుని 2024 ఎన్నికల నాటికి మరోసారి గట్టి జవాబు చెబుతారని అంటున్నారు. 

 

దానికి కాచుకుని రెడీ అవాల్సింది టీడీపీతో పాటు విపక్షాలేనని అంటున్నారు.  బాబు వంటి రాజకీయ చాణక్యుడు జగన్ కి ప్రధాన పోటీదారుగా ఉండి పావులు వేయడమే ఇపుడు జగన్ కి కలసి వచ్చిందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: