ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ దశల వారీగా మద్యపాన నిషేధం చేయడానికి పూనుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కొన్ని షాపులని క్లోజ్ చేసి, ప్రభుత్వమే షాపులని నడిపేలా చర్యలు తీసుకున్నారు. అలాగే మద్యం వినియోగం తగ్గుతుందని చెప్పి, మద్యం ధరలు కూడా పెంచారు. ఇక ఇక్కడవరకు అంతా బాగానే ఉంది.

 

కానీ గతంలో వచ్చిన మద్యం బ్రాండ్లు ఇప్పుడు రావడం లేదు. కొత్త కొత్త బ్రాండ్లు ఏపీలో కనిపిస్తున్నాయి. ఉదాహరణకు గతంలో బీర్లలో కింగ్ ఫిషర్, నాకౌట్ అంటూ కొన్ని బ్రాండ్లు కనిపించేవి. కానీ ఇప్పుడు బూమ్ బూమ్, హిమాన్ బీర్లు దర్శనమిస్తున్నాయి. అయితే నాసిరాకమైనని అని, ఇవి తాగితే ఆరోగ్యం పాడైపోతుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కొందరు బాబులు కూడా ఈ బ్రాండ్లపై అసంతృప్తిగా ఉన్నారు.

 

కానీ టైంకి ఏదొకటి దొరుకుతుందిలే అన్నట్లు కొనుక్కొని తాగేస్తున్నారు. అయితే కరోనా వల్ల లాక్ డౌన్ ఉండటం వల్ల 40 రోజులు పైనే వైన్ షాపులు బంద్ అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు లాక్ డౌన్ లో సడలింపులు రావడంతో, మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. మళ్ళీ అవే బ్రాండ్లు దర్శనమిస్తున్నాయి. దీంతో టీడీపీ నేతలు మళ్ళీ విమర్సలు చేయడం మొదలుపెట్టారు.

 

ఇక టీడీపీ నేతలకు కౌంటర్ ఇవ్వడంలో భాగంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ..గతంలో మద్యం తయారీ కోసం చంద్రబాబు ఏవైతే డిస్టలరీలకు పర్మిషన్ ఇచ్చారో, తాము కూడా వాటికే పర్మిషన్ ఇచ్చామని చెబుతున్నారు. అయితే గతంలో ఎన్ని డిస్టలరీలకు పర్మిషన్ ఇచ్చారో, ఎన్ని బ్రాండ్లకు పర్మిషన్ ఇచ్చారో చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

 

చంద్రబాబు అయితే పర్మిషన్ ఇచ్చారు గానీ, ఎన్నిటికి ఇచ్చారో, ఏ బ్రాండ్లకు ఇచ్చారో తమకు అంత ఐడియా లేదని మంత్రి పేర్ని నానిమీడియా డిబేట్ లో చెప్పారు. అంటే వైసీపీనే కొత్త డిస్టలరీలు తీసుకొచ్చి, కొత్త బ్రాండ్లని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: