ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలని జగన్ చాలా సందర్భాల్లో విమర్శలు చేశారు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ ప్రతిపక్షంలో ఉంది. టీడీపీ నాయకులు జగన్ కేసీఆర్ ను చూసి నేర్చుకోవాలంటూ పలు సందర్భాల్లో విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన కొన్ని హామీలను నెరవేర్చలేకపోయారు. 
 
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్కీమ్, గిరిజనులకు మూడు ఎకరాలు ఇస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. కానీ కేసీఆర్ కు రాష్ట్రంలో మీడియా సపోర్ట్ మొదటి నుండి ఉంది. తెలంగాణలో అన్ని టీవీ ఛానెళ్లు, పత్రికలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తాయని ప్రతిపక్షాలు సైతం పలు సందర్భాల్లో విమర్శించాయి. మరోవైపు టీడీపీ ఏపీలో వైసీపీ మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై విమర్శలు చేస్తోంది. 
 
అయితే తెలంగాణలో మద్యం అమ్మకాలపై, ఢిల్లీలో మద్యం రేట్లు పెంచడంపై విమర్శలు చేయలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మద్యంపై ట్యాక్స్ కూడా పెంచుతున్నామని అన్నారు. 
 
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే తెలంగాణలో ఉన్న టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్ పై ఎటువంటి విమర్శలు చేయలేదు. జనసేన కూడా కేసీఆర్ పై విమర్శలు చేయలేదు. కానీ కేసీఆర్ మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చే సమయంలో ఎటువంటి విమర్శలకు తావివ్వకుండా మాట్లాడారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ మద్యం దుకాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మందుబాబులు హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: