దాదాపు జగన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో అదే రీతి లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే చంద్రబాబు ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం లోనే ఉంటూ వైయస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. కరోనా వైరస్ వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ రాష్ట్రం లో హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఏపీ ప్రతిపక్షనేతగా ఉంటూ సమస్య ఏపీ లో ఉంటె అక్కడ బాబు అక్కడ ఉండటం ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు లాక్ డౌన్ అమలులో ఉన్న నాటి నుండి ఏపీ ప్రభుత్వం కరోనా వైరస్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేస్తూనే ఉన్నారు.

 

ముఖ్యంగా ఇటీవల కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ మూడో దశ పొడిగించిన సమయంలో మద్యం షాపు ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం అనుమతి ఇవ్వటం మనకందరికీ తెలిసినదే. వెంటనే ఏపీలో కేంద్రం ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు మరియు ఆ పార్టీకి చెందిన నాయకులు జగన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు. అసలు మద్యపానం చేస్తా అన్నాడు...కేంద్రం ఇలా పరిమిషన్ ఇచ్చిందో లేదో అలా ఓపెన్ చేశాడు జగన్ కి చిత్తశుద్ధి లేదు అంటూ తెగ సీరియస్ అయ్యారు.

 

ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా జగన్ మీద విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం వీరిద్దరూ హైదరాబాదు లోనే ఉండటం జరిగింది. తాజాగా కేసిఆర్ రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు అనే తారతమ్యాలు లేకుండా… అన్ని జోన్ ల లోనూ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ మద్యం షాపులు తెరిచే ఉంటాయని ప్రకటించారు. మరి అంతగా జగన్ మీద అరిచినా చంద్రబాబు ఈ విషయంలో కేసీఆర్ మీద అరిచే సీనుందా మీకిప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో టిడిపి ఉంది మరి తెలంగాణలో మద్యం దుకాణాలు ఓపెన్ చేసిన కేసీఆర్ గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్పాలని మరి కొంతమంది అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: