దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి పెద్ద ఎత్తున జ‌రిగేందుకు కార‌కులుగా పలు పార్టీలు పేర్కొంటున్న త‌బ్లీగీ జ‌మాతే స‌భ‌ల‌కు హాజ‌రైన వారి ఉదంతంలో మ‌రో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. దేశరాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో జరిగిన తబ్లిగి జమాత్‌ కార్యక్రమానికి హాజరైన వారిలో 24 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఈ క్రమంలో కార్యక్రమ నిర్వాహకులైన మౌలానా సాద్‌ తదితరులపై అంటువ్యాధుల చట్టం 1897  ప్రకారం FIR నమోదు చేశారు. అయితే, ఆయ‌న ఆచూకి దొర‌క‌పోవ‌డంతో మర్కజ్ జమాతే చీఫ్ కుమారున్ని ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు విచారించారు.

 

మర్కజ్‌లో సమావేశాలకు హాజరై వారిలో కొంతమంది కరోనా బారిన పడటంతో అసలు ఈ సమావేశాలను నిబంధనలు ఉల్లంఘించి నిర్వహించారంటూ 20 మంది పై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఈ 20 మంది పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు జామాతే చీఫ్ కుమారున్ని సైతం ప్రశ్నించారు. వారి అచూకీ తెలిస్తే చెప్పాలంటూ కోరారు. పరారైన వారి ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ తో పాటు సమాచారాన్ని సేకరించారు. మౌలానా చీఫ్ సాద్ కుమారుడికి తబ్లీగ్ జమాత్ కార్యకలాపాలతో సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో వారి జాడ తెలిసి ఉంటుందేమోనని విచారించామని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న జామతే సభ్యులకు కరోనా సోకిందా వారి కారమంగా ఇతరులకు కరోనా సోకే అవకాశం ఉంటుందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. మర్కజ్ సమావేశాల తర్వాతే దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిందంటూ పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

 

ఇదిలాఉండ‌గా, నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు లేఖ రాశారు. మర్కజ్‌కు హాజరైన 12 మంది విదేశీయులు సమాచారాన్ని రహస్యంగా ఉంచినందుకు జామా మసీదు వజీరాబాద్‌ ఇమామ్‌పై కూడా కేసు నమోదు చేశారు. మార్చి 13 నుంచి 15 వరకు జరిగిన ఈ సమావేశానికి  భారీ సంఖ్యలో భక్తులు హాజరై ఉంటారని అధికారులు అంచనా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: