కేంద్ర ప్రభుత్వంపై టిఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మొన్నటి వరకు ముందుగా తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కరోనాకు సంబంధించి తెలంగాణకు కేంద్రం సహాయ సహకారాలు అందించడంపైన ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ తడాఖా ఏంటో చూపిస్తాము అంటూ కేంద్రానికి హెచ్చరికలు కూడా చేసిన సంగతి తెలిసిందే. టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనా పరిస్థితుల్లో కేంద్రం రాష్ట్రానికి చేసిన సహాయం ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్ ఆర్ బీ ఏం పరిమితిని పెంచాలని కేంద్రాన్ని కోరినా, స్పందన లేదని హరీష్ రావు మండిపడ్డారు. పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీపైన ఆయన విమర్శలు చేశారు. 

IHG


రైతుబంధు కోసం 12  వేల కోట్లు కేటాయిస్తే, రూపాయి కోత పెట్టకుండా  12 వేల కోట్లు విడుదల చేశామని, హరీష్ రావు చెప్పుకొచ్చారు. రైతుల కోసం నిరంతరం ఆలోచిస్తున్న కేసీఆర్ పై విమర్శలు చేస్తే సహించేది లేదంటూ ఆయన ధ్వజం ఎత్తారు. త్వరలోనే రైతులకు 25 వేల రూపాయల రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు, దీనికోసం ఆర్థిక శాఖ 1200 కోట్లు విడుదల చేసినట్లు హరీష్ చెప్పారు. వ్యవసాయ శాఖ ఈ మొత్తాన్ని అంటే  5.85 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేయబోతున్నట్లు ఆయన చెప్పారు.

 

IHG't Be Extended: Here Are 10 Things We Must Do By Mid-April


 ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధంగా చేయమని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిసార్లు కోరిన కేంద్రం పట్టించుకోలేదని, అలాగే కరోనా విషయంలోనూ ఎటువంటి సహాయం చేయలేదని, కేంద్రం తీరుపై హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: