నెలన్నర తరువాత తెలంగాణ లో వైన్ షాపులు తెరుచుకోవడంతో మందు బాబులు పండగ చేసుకున్నారు. కంటైన్మెంట్ జోన్ లోని 15షాపులు మినహా రాష్ట్రంలోని  మిగతా అన్ని మద్యం దుకాణాలు  తెరుచుకోవడంతో పెద్దగా షాపుల ముందు హడావిడి కనిపించలేదు. కానీ మద్యం కావాల్సిన వారు మాత్రం  లైన్లో లో నిల్చొని భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరంచి కొనుగోలు చేశారు. అక్కడక్కడ కొన్ని షాఫుల ముందు నిబంధలను పెద్దగా పాటించనప్పటికీ తొలి రోజు మాత్రం ప్రశాంతంగా అమ్మకాలు జరుగాయి.
 
ఇక మొదటి రోజు 90కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని రాష్ట్ర అబార్కి శాఖ వెల్లడించింది. అలాగే మొత్తం 120000 బీర్లు అమ్ముడయ్యాయని పేర్కొంది. షాపులు అన్ని తెరవడం దానికి తోడు మద్యం ధరలు పెంచడం తో తొలి రోజు రికార్డు స్థాయిలో వసూళ్లు సాధ్యమయ్యాయి. పెంచిన దరల ఫై కూడా మందు బాబులు ఆగ్రహం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
 
ఇక కరోనా కేసుల విషయానికి వస్తే రాష్ట్రంలో ఈరోజు మరో 11 కొత్త కేసులు నమోదయ్యాయని అవన్నీ కూడా జిహెచ్ఎంసి పరిధిలోనే నని రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదలచేసింది. ఈ కొత్త కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కేసుల సంఖ్య 1107 కు చేరింది. అందులో ప్రస్తుతం 430 కేసులు యాక్టీవ్ గా ఉండగా 648 మంది బాధితులు కోరుకున్నారు 29 మంది మరణించారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ ఒక్క రోజే  ముంబై లో 1233 కేసులు నమోదు కాగా మహారాష్ట్ర లో మొత్తం కేసుల సంఖ్య 16,758 కి చేరింది. ఓవరాల్ గా ఇండియాలో ఇప్పటివరకు 52000 కరోనా కేసులు నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: