ప్రస్తుతం జేడీ లక్ష్మీనారాయణ అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ జగన్ కేసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయడంతో వైసీపీ అప్పట్లో ఆయనను  సీరియస్ గా టార్గెట్ చేసింది. ఇక ఆ తర్వాత కాలంలో జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీ లోకి వెళ్ళగానే ఒక గొప్ప నాయకుడు తమ పార్టీలో ఉన్నాడు అని మొదట జనసేన పార్టీ అనుకున్నప్పటికీ ఆ తర్వాత జేడీ  లక్ష్మీ నారాయణ ను పార్టీ పక్కనపెట్టేసింది. ఇక ఆయన కూడా ప్రస్తుతం జనసేన నుంచి సైడ్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. 

 


 ప్రస్తుతం ఆయనను  టార్గెట్ చేయడం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రాజకీయాలకు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో... అయితే గతంలో జనసేన పార్టీని వీడిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ... కొత్త పార్టీ వైపు ఆశగా చూస్తున్నారని... విశాఖ నుంచి జనసేన తరపున పోటీ చేసిన జేడీ... ఓడిపోయిన తర్వాత జనసేన లో ఉన్నప్పటికీ రాజకీయంగా క్రియాశీలకంగా ఎక్కడా వ్యవహరించలేదు. ప్రస్తుతం సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జగన్ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఆంధ్ర రాజకీయాలు చర్చించుకుంటున్నారు.

 

 అయితే జేడీ లక్ష్మీనారాయణ 2014 సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చి... మొదట టిడిపి నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ ఆ తర్వాత జనసేన పార్టీలో చేరి జనసేన నుంచి పోటీ చేశారు. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో కీలకంగా మారడానికి పారదర్శకంగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ప్రభుత్వం చేస్తుంది మంచి అయితే మంచిది అని చెడు అయితే చెడు అని నిర్మాణాత్మకంగా మాట్లాడుతున్నారు. అయితే ఇది నచ్చని వాళ్ళు జేడీ లక్ష్మీనారాయణ వైసీపీలో చేరబోతున్నారూ  అని ప్రచారం మొదలు పెట్టారు అని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: