నాన్న అనే పిలుపులో ఎంతో నమ్మకం కనిపిస్తుంది.. నాన్న అనే పలుకులో ఆ నమ్మకానికి శక్తి వస్తుంది.. అమ్మా అని ఎవరినైనా పిలవవచ్చు కానీ నాన్న ఆని ఎవర్నిపడితే వారిని పిలవడానికి అస్కారమే లేదు.. ఎందుకంటే నాన్న అనే పదానికున్న బలం అది.. కానీ నేటికాలంలో ఈ పాడు సమాజంలో నాన్నతో పాటుగా, నాన్న అనే పదం కూడా చెదలు పట్టి నాశనం అవుతుంది.. కన్న తండ్రినే కాకుండా వేరేవారిని నాన్న అనిపిలిచామంటే.. ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవం.. ఆ ఇంటిలో అతనికి దక్కిన హోదా.. కాని ఇలాంటి పిలుపుచాటున కూడా తోలుకప్పుకున్న తోడేళ్లు మాటువేసి ఉన్నాయి.. అందుకు నిదర్శనమే ఇప్పుడు మనం చెప్పుకునే సంఘటన..

 

 

ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన తండ్రి అంటే ఎంతగా తల్లడిల్లేలా చేశాడో అర్ధం అవుతుంది.. అదేమంటే సవతి కూతురిని లైంగికంగా వేధించాడు ఈ నీచుడు.. తాను కనకపోయినా నాన్న అని పిలిచినందుకైనా అతనిలో తండ్రిని అనే భావన ఏమాత్రం కలగకపోగా.. కళ్లను కప్పిన కామం వావివరసలు మరచి ఆమె పొందు కోరింది.. తన కోరిక తీర్చుకోవడానికి వేసిన ఎత్తులో భాగంగా ఆ బాలికకు గత కొన్ని నెలలుగా పోర్న్ వీడియోలు చూపిస్తూ తన కోరిక తీర్చమని వేధిస్తున్నాడట..

 

 

ఇలా ప్రతిరోజు బాలికను బలవంతం చేస్తూ వచ్చాడు. ఇక ఇలాగైతే పని అవదని ఇంట్లో ఎవరు లేని సమయం చూసి అత్యాచారానికి యత్నించాడు.. దీంతో ఆ బాలిక భయపడిపోయి గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసి ఇరుగుపొరుగు వారికి విషయాన్ని తెలుపగా.. వారు వెంటనే చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో కామాంధు అయిన తండ్రి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 

 

ఇకపోతే బాలిక చెప్పిన వివరాలతో నిందితుడిపై సూరజ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. చూశారా కాలం వేగంగా పరిగెడుతుంది.. మనుషులు కూడా అంతే వేగంగా మృగాళ్లుగా మారుతున్నారు.. అయినా కాని ఇన్ని జరుగుతున్న సమాజంలో ఏమాత్రం మార్పు రావడం లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: