కరోనా వైరస్ విషయంలో ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం అదుపులోకి రావడం లేదు. మొదటిలో దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు కరోనా వైరస్ తో పోరాడే విషయంలో భారత అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శిస్తుందని ప్రశంసించారు. అయితే ఎప్పుడైతే ఢిల్లీ మత ప్రార్థనలు ఘటన బయటపడిందో వైరస్ కేసులు బయటపడ్డాయో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఎవ్వరూ ఊహించని విధంగా కరోనా వైరస్ భయంకరంగా సోకింది. దాదాపు దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో 40 శాతం వరకు ఢిల్లీ మత ప్రార్థనలకు సంబంధించిన వారికి అటాచ్ వున్నవే. దీంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ మూడు దశలు అమలు చేసింది.

 

ప్రస్తుతం మూడో దశలో ఉన్న లాక్ డౌన్ ఉన్న గాని దేశంలో కరోనా వైరస్ అరికట్టే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. ఇటువంటి సందర్భంలో మోడీ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేమిటంటే దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిలో సర్వే చేయాలని మోడీ సర్కార్ డిసైడ్ అయ్యింది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కరోనా వైరస్ తాజా వివరాలను ప్రకటించడం జరిగింది. కరోనా వైరస్ కేసుల విషయంలో రాష్ట్రాల నుండి సరైన సమాచారం టైం కి రావటం లేదని…. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో కన్ఫ్యూజన్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు.

 

అయితే కరోనా వైరస్ కట్టడిలో దేశమంతా ఒకేసారి పరీక్షలు చేస్తే మొత్తం బాధితులు వెలుగులోకి వస్తారని వారందరినీ ఆస్పత్రికి తరలించి వైరస్ చైయిన్ను కట్ చేసే ఆలోచనలో కేంద్రం ఉందని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కేసులు ఎలా పెరుగుతున్నాయో అదేవిధంగా రికవరీ రేటు కూడా పెరుగుతుందని చెప్పుకొచ్చారు. మొత్తంమీద చూసుకుంటే రాబోయే రోజుల్లో కేంద్ర బృందాలు ప్రతి జిల్లాలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడానికి రెడీ అవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రి లవ్ అగర్వాల్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: