చంద్రబాబు ఇప్పుడు ఓ ప్రతిపక్షనేత.. ప్రజల కోసం పోరాడటం ప్రతిపక్షం విధి. అందులో భాగంగానే ఆయన అనేక మందికి లేఖలు రాస్తున్నారు. అయితే ఇలాంటి లేఖల విషయంలో కొందరు నాయకులకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అలాంటి వారిలో దత్తాత్రేయ ఒకరు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు రెండు, మూడు రోజులకో ఉత్తరం ముఖ్యమంత్రి రాసేవారు. దాన్ని ప్రెస్ కు ఇచ్చేవారు.

 

 

అంతకు మించి ఆ లేఖల వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండకపోయేది. ఇప్పుడు ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ కూడా రోజూ జగన్ సర్కారుకో.. ఇంకొకరికో లేఖలు రాస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి రికార్డులను ఏపీ మాజీ ప్రతిపక్షనేత చంద్రబాబు బద్దలు కొట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఆయన ఇటీవల తరచూ ఎవరో ఒకరికి ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. అంతెందుకు.. నిన్న ఒక్కరోజే ఆయన చాలా మందికి ఉత్తరాలు రాశారు.

 

 

అవేంటో చూద్దామా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి బుధవారం చంద్రబాబు లేఖ రాశారు. విషయం ఏంటంటే.. వివిధ రాష్ట్రాల్లోని తెలుగువారిని తీసుకొచ్చేందుకు జగన్ సర్కారు చర్యలు తీసుకోవాలట. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, బెంగాల్‌, దిల్లీ, యూపీలో తెలుగువారు చిక్కుకుపోయారట. గల్ఫ్‌, యూరప్ దేశాల్లో తెలుగువాళ్లు చిక్కుకున్నారట. వీరందరినీ స్వస్థలాలకు చేర్చేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలట.

 

 

అదేంటీ.. ఈ పని ఇప్పటికే జగన్ సర్కారు చేస్తోందిగా అంటారా.. అలా మీరు అనకూడదు. ఎందుకంటే.. రేపు జగన్ సర్కారు ఈ పని చేశాక..అదిగో నేను లేఖ రాస్తే కానీ జగన్ అడుగు ముందుకు వేయలేదు అని చంద్రబాబు చెప్పుకోవాలి కదా. అదన్నమాట సంగతి. అంతేనా.. చంద్రబాబు బుధవారం.. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. సోలాపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను ఆదుకోవాలన్నారు. కర్నాటకలో చిక్కుకుపోయిన తెలుగువాళ్లను కాపాడాలంటూ కర్ణాటక సీఎం యడియూరప్పకు లేఖ రాశారు. చిత్తూరు జిల్లాలో శాంతిభద్రతలు కాపాడాలని డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. అంతే.. ఆయన అలా రాస్తూ పోతారంతే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: