అసలు జగన్ ధైర్యం ఏంటి.. ఈ ప్రశ్నకు సమాధానం చాలా మందికి అర్థం కావడంలేదు. ఏ విషయంలో అంటారా.. ఆంధ్రప్రదేశ్ సర్కారు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సైతం జీతాల్లో కోత వేయడం.. వంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే.. జగన్ సర్కారు మాత్రం తాను ఇచ్చిన హామీలకు కట్టుబడే ఉంటానంటోంది. ఇంత ఆర్థిక కష్టాలు ఉన్న పరిస్థితుల్లోనూ జగన్ తన మాట నిలబెట్టుకుంటున్నారు.

 

 

వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకాన్ని తాజాగా ప్రారంభించారు. ఇది గతంలో ఇచ్చిన హామీయే.. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా మత్స్యకారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడి వారి కష్టాలు, నష్టాలు తెలుసుకున్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు రూ.10 వేలు ఆర్థికసాయం అందిస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ మత్స్యకారులకు తెలిపారు.

 

 

సీఎం వైయస్‌ జగన్‌ బటన్‌ నొక్కగానే మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 10 వేల నగదు జమ అయ్యింది. రాష్ట్రంలో 1,09,231 మంది లబ్ధిదారులకు ఆర్థిక ప్రయోజనం చేకూరింది. వంద కోట్ల రూపాయలు ఇందుకు కేటాయించారు. మునుపెన్నడూ లేని రీతిలో వేట నిషేధ సమయంలో సాయం అందుతుండటంతో మత్స్యకారులు సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 

 

ఈ ఒక్క పథకమే కాదు.. జగన్ తాను ఇచ్చిన హామీల విషయంలో మాత్రం చాలా వరకూ కట్టుబడి ఉండేందుకే మొగ్గు చూపుతున్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సరే.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తపిస్తున్నారు. మరి ఈ సంక్షేమ పథకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎటు తీసుకెళ్తాయో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: