అసలే కష్టకాలం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మృత్యువు  ఎక్కడ మృత్యువు దరిచేరుతుందో అని  ప్రాణభయంతో బతుకుతున్నారు. అదేంటో గాని ఇలాంటి క్లిష్ట సమయంలోనే మరిన్ని సమస్యలు ప్రజల చెంతకు చేరుతున్నాయి. వారిలో మరింత ప్రాణ భయాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురం లోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుండి  విషవాయువులు లీకవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు ఎల్జి పాలిమర్స్ నుండి విషవాయువులు కావడం... మూడు కిలోమీటర్ల మేర వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. ఒక్కసారిగా ఎక్కువ మొత్తంలో లీక్ అయిన  గ్యాస్ కాస్త పీల్చుకోవడం తో అసలు ఏం జరుగుతుందో వాళ్లకి అర్థం కాని పరిస్థితి. క్రమక్రమంగా ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఏర్పడడంతో అచేతన స్థితిలో కి వెళ్ళి పోతున్నారు. 

 

 

 దీనిపై అధికారులకు సమాచారం అందించడంతో అస్వస్థతకు గురైన వందలమందిని ఆస్పత్రికి హుటాహుటిన తరలిస్తున్నారు అధికారులు. పోలీసులు కూడా చుట్టుపక్కల గ్రామాల వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే విషవాయువు వ్యాప్తిని తట్టుకోలేక పోయిన ప్రజల ఇళ్ల నుంచి పరుగులు పరుగులు తీస్తూ మేఘాద్రి గడ్డ  వైపు వెళ్తున్నారు. ఇక ఈ విష వాయువు తీవ్రమైన ఘాఢతతో  ఉండడంతో... చాలా మంది జనం ఇంట్లో తలుపులు వేసుకొని ఉండిపోయినప్పటికీ విష వాయువు ప్రభావం వాళ్ల పై చూపిస్తుంది. ఓవైపు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారుతుందని మరోవైపు తీవ్ర కళ్ల మంటలు, కడుపులో వికారం లాంటివి జరుగుతున్నాయి. 

 

 

 ఇక ఆయా గ్రామాల ప్రజలను వెంటనే ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ విష వాయువు లీకేజీ అరికట్టడానికి మరో రెండు గంటలపాటు శ్రమించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఎల్జి పాలిమర్స్ కంపెనీలో ప్లాస్టిక్ ను ఉత్పత్తి చేస్తారు. పెద్ద ఎత్తున ఇందులో సరుకు నిల్వ ఉంది. కాగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా రసాయన వాయువు కాస్త విడుదల కావడంతో... కొంత మంది ప్రజలు అక్కడికక్కడే రోడ్డుపైన స్పృహ కోల్పోతున్నారు. ఇంకొంతమంది ప్రజలు నిద్రలో ఉండడం వల్ల మరింత ఎక్కువ నష్టం వాటిల్లుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: