విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం సృష్టిస్తోంది. అర్థరాత్రి సమయంలో గ్యాస్ లీకైనట్టు తెలుస్తోంది. ఈ గ్యాస్ ప్రభావం జనంపై తీవ్రంగా ఉంది. తెల్లవారుజామున ఆర్.ఆర్‌.వెకంటాపురం నుంచి విశాఖ రైల్వే స్టేషన్‌కు డ్యూటీ నిమిత్తం వచ్చిన ఓ కానిస్టేబుల్‌ సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతన్ని వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

 

 

గ్యాస్ లీక్ మాత్రం ఇంకా అదుపులోకి వచ్చినట్టు సమాచారం లేదు. తీవ్రత కాస్త తగ్గినా.. పరిస్థితి ఇంకా ఇబ్బంది కరంగానే ఉంది. వందల మంది అనారోగ్యం పాలయ్యారు. జనం ఊపిరి ఆడక ఎక్కడివారు అక్కడే పడిపోయిన పరిస్థితి ఉంది. జనం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. 3 కి.మీ మేర ఈ గ్యాస్ వ్యాపించింది. చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

 

 

ఇళ్లలోనే ఉన్నవారు ఎందరో చెప్పలేని పరిస్థితి నెలకొంది. బాధితులను అందుబాటులో ఉన్న ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఎంత మంది దీని బారిన పడ్డారు.. ఎందరికి అనారోగ్యంలో ఉన్నారో అధికారులే చెప్పలేని పరిస్థితి ఉంది. గ్యాస్ వల్ల కళ్లు కనిపించక బావిలోపడి ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: