విశాఖ శివార్లలో గ్యాస్ లీకేజీ ఘోరం సృష్టించింది. అర్థరాత్రి గ్యాస్ లీక్ కావడంతో జనం ఉక్కిరి బిక్కిరయ్యారు. ఊపిరి తీసుకోలేకపోయారు. గ్యాస్ ధాటికి పిచ్చెక్కిపోయారు. చాలా మంది నిద్రలోనే స్పృహ కోల్పోయారు. ఇలాంటి సమయంలో గ్రామానికి చెందిన యువకులు ఆపద్భాంధవులుగా మారారు.

 

 

పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల్లోని యువకులు అత్యంగ వేగంగా స్పందించారు. వారే గ్రామాల్లోకి తలుపులు బద్దలు కొట్టి అపస్మారక స్థితిలో ఉన్న ప్రజలను అప్పటికప్పుడు దొరికిన వాహనాల్లోనూ.. ఆ తర్వాత అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించారు. ఆ గ్రామాల్లోని యువకులు తగిన చొరవ తీసుకోకపోతే.. చాలా ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు.

 

 

ఇప్పటి వరకూ తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ముగ్గురు చనిపోయినట్టు తెలిసింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. జనం ఇళ్లలోనే ఉండిపోవడం వల్ల ఎంత మంది ప్రమాదానికి గురయ్యారో తెలియని పరిస్థితి నెలకొంది. దాదాపు 200 మందికి పైగా అస్వస్థతకు గరైనట్లు తెలుస్తోంది. సైరన్‌లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఐదారు గ్రామాల్లోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: