విశాఖ గ్యాస్ లీకేజీ ఘోర ఘటనలో జనం హాహాకారాలు పెడుతూ పరులుగు తీశారు. ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేశారు. కొందరు నిద్రలోనే స్పృహ కోల్పోయారు. అయితే ప్రజల పరిస్థితి ఇలా ఉంటే.. మూగజీవాల పరిస్థితి మరీ దారుణగా ఉంది. విశాఖ శివార్లలోని ఆర్.ఆర్. వెంకటాపురం వంటి గ్యాస్ లీకేజీ ప్రభావిత గ్రామాల్లో పలు మూగజీవాలు మృత్యువాతపడ్డాయి.

 

 

జనమైతే ఎలాగోలో పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ.. పాపం.. మూగజీవాలు కట్టేసి ఉండటంతో ఎటూ వెళ్లలేకపోయాయి. సాధారణంగా గ్రామాల్లో రాత్రి వేళల్లో పశువులను కట్టేసి ఉంచుతారు. దాంతో అవి గింజుకుని గింజుకుని మృతి చెందాయి. చాలా మూగ జీవాలు గ్యాస్ ధాటికి ఉక్కిరిబిక్కిరయ్యాయి. చాలా ఆవులు, దూడలు చనిపోయాయి.

 

 

మిగిలిన పశువులు కూడా అనారోగ్యం బారిన పడ్డాయి. ఈ గ్రామాలు ఎక్కువగా పాడి పరిశ్రమపై ఆధారపడి ఉండటం వల్ల ఎక్కువగా పశు సంపద ఉంది. ప్రస్తుతం అధికారులు ప్రజల ప్రాణాలు కాపాడే ప్రయత్నాల్లో ఉన్నా.. ఈ మూగజీవాల గురించి పట్టించుకునేవారు కరవయ్యారు. వెటర్నరీ డాక్టర్లను భారీగా రప్పించి వాటికి వైద్యం చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: