ఈ లోకంలో సాటివారికి చెడు చేయాలంటే మనిషి తర్వాతనే ఏదైనా.. కౄరమృగాలు సైతం ఇలా ప్రవర్తించవేమో.. అంతకంటే ఘోరంగా మనుషులు మారుతున్నారు.. ఇకపోతే పేదవారు హస్పిటల్లో వైద్యం చేయించుకుని బిల్లు కట్టకుంటే మంగళ సూత్రాలు తాకట్టుపెట్టి బిల్లులు కట్టించుకున్న చరిత్ర ప్రైవేట్ హస్పిటల్స్‌కు ఉంది.. వైద్యం చాటునా ఎన్నో మోసాలు జరుగుతున్న వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి.. అరకొర మాత్రమే బయటకు వస్తున్నాయి.. ఇక ఇక్కడ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి ఓ ప్రముఖ ఆస్పత్రి అవయవాలను సేకరించిన వ్యవహారం విశాఖలో వివాదాస్పదంగా మారుతోంది.. ఆ వివరాలు తెలుసుకుంటే..

 

 

ఒడిశాలోని గంజాం ప్రాంతం జాగాపూర్‌కు చెందిన కడియాల సహదేవ్ (32) అనే వ్యక్తి 2016 డిసెంబరు 13 న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అయితే అతని బంధువులు చికిత్స కోసం విశాఖలోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చారు.. ఈ క్రమంలో హస్పిటల్ వైద్య సిబ్బంది ఐదు రోజుల పాటు వైద్యం అందించిన అనంతరం బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు పేర్కొంది. అప్పటికి ఆసుపత్రి బిల్లు సుమారు రూ. 1.70 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపధ్యంలో బాధితుడి తల్లిదండ్రులు, బంధువులు తమవద్ద అంత అమౌంట్ లేదని తాము దీనస్దితిలో ఉన్నామని చెప్పగా ఆ ఆసుపత్రి సిబ్బంది అవయవాలు దానం చేస్తే డబ్బులు కట్టకుండా మృతదేహాన్ని తీసుకెళ్లవచ్చని సూచించారట..

 

 

అనంతరం వారి నుంచి సంతకాలు తీసుకుని బ్రెయిన్‌ డెడ్‌ అయిన సహదేవ్‌ నుంచి కిడ్నీలు, కాలేయం, రెండు కార్నియాలను సేకరించారట.. ఇక అతని భార్య గర్భంతో ఉండటంతో ఆ సమయంలో అందుబాటులో లేదు.. ఈ తంతు ముగిసిన అనంతరం అతని భార్య, భర్త అంత్యక్రియలు చేశాక బీమా క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేయగా అది తిరస్కరణకు గురైంది. ఇలా ఎందుకు జరిగిందో అని తెలుసుకుంటే.. పోస్టుమార్టం నివేదిక ప్రకారం సహదేవ్‌ మృతదేహంలో అవయవాలు లేవని బీమా సంస్థ పేర్కొనడంతో నివ్వెరపోయిన మృతుని భార్య జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా, ఈ ఘటనపై కమిషన్‌ ఆదేశాల మేరకు మూడో పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

 

ఆసుపత్రి యాజమాన్యంపై ఏపీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఆర్గాన్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కోరాడ రామారావు తెలిపారు.. ఇకపోతే అవయవాల్ని దానం చేయాలంటే జీవిత భాగస్వామి సంతకం తప్పనిసరిగా ఉండాలన్నది బాధితురాలి వాదన. మరి బాధితురాలికి న్యాయమే జరగాలని కోరుకుందాం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: