విశాఖపట్నం గోపాలపట్నం పరిధి ఆర్‌.ఆర్‌.వెంకటాపురం ఈ తెల్ల వారు జామున ఉపిరాడక ఉక్కిరిబిక్కిరయింది. కొంతమంది ప్రజలు సృహ కోల్పోయారు. కొందరికి చర్మం మీద దద్దులు వచ్చారు. నిద్రమత్తు విదిలించుకుని చాలా మంది ప్రాణభయంతో పరిగెత్తారు. అంబులెన్సలొచ్చి చాలా మంది ఆసుప్రతులకు తరలించాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా 3 కిలోమీటర్ల మేర కెమికల్ గ్యాస్ వ్యాపించింది. దీంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే ముగ్గురి మృతి చెందారని.. సుమారు 200 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని తెలియవచ్చింది. పాలిమర్స్‌ బాధితులతో కేజీహెచ్‌ నిండిపోయింది.కళ్ళు మంటలు, ఒంటిపై దద్దుర్లు, కడుపు నొప్పి వంటి వాటితో ఇబ్బం దులు పడుతున్నారు.  శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడటంతో వారిని హుటాహుటిన విశాఖలోని అనేక హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. 

 

ఒక్కో బెడ్‌పై ముగ్గురు చొప్పున చిన్నారులకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. అంబులెన్స్‌లు, వ్యాన్లు, కార్లలో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.  అస్వస్థతకు లోనయిన వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో మాట్లాడారు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన ప్రత్యేక విమానంలో కొద్ది సేపట్లో విశాఖ వెళ్లున్నట్లు సమాచారం అందింది. ఇక ఈ గ్యాస్ వలన ప్రజలతో పాటుగా మూగజీవాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి.  ఎక్కడి జీవాలు అక్కడే ప్రాణాలు విడిచిపెడుతున్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న జీవులు బల్లులు ఇతర ప్రాణులు రోడ్లపై కనిపిస్తున్నాయి.  

 

ఊపిరాడక ఐదు గ్రామాల్లోని మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. పక్షులు, కోళ్లు, కుక్కలు వంటివి ఎక్కువగా మృత్యువాత పడుతున్నట్టు తెలుస్తోంది. ఇక గ్రామాల్లో కట్టేసిన పశువుల పరిస్థితి ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.  ఎల్జీ పాలిమర్స్ లో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న పోలీసులు సైతం విష వాయువుల వలన అస్వస్థతకు గురవుతున్నారు.  కరోనానే ఛస్తున్నామంటే.. ఇదెక్కడి ఉపధ్రవంరా దేవుడా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: