లాక్‌డౌన్‌పై కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌పై కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌తిస్పందిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ప్ర‌భుత్వానికి ప్ర‌తిప‌క్షంగా కాంగ్రెస్ స‌హ‌క‌రిస్తూనే ఉంటుంద‌ని చెబుతున్న ఆమె మ‌రోవైపు మాత్రం బీజేపీ విమ‌ర్శ‌నాస్త్రాల‌తో  క‌రోనా వేళ రాజ‌కీయాల్లో వేడి పుట్టిస్తున్నారు. లాక్‌డౌన్ అమ‌లులో జ‌రుగుతున్న త‌ప్పిదాల‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. అంతేకాక వ‌ల‌స కూలీల‌ను ఆదుకునేందుకు, స్వ‌రాష్ట్రాల‌కు చేర్చేందుకు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆమె రెండు రోజుల క్రితం ఆదేశించిన విష‌యం తెలిసిందే. 

 

తాజాగా కేంద్రంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వానికి సూటిగా ప్ర‌శ్న‌లు సంధించారు.మూడో విడత లాక్‌డౌన్‌ ఈనెల 17న ముగుస్తుందా? ఆ తరవాత పరిస్థితి ఏమిటి? అని ఆమె కేంద్రాన్ని నిలదీశారు.  లాక్‌డౌన్‌ను ఎంతకాలం కొనసాగిస్తారనే అంశంపై ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం వివ‌రించాల‌ని సూచించారు. క‌రోనా క‌ట్ట‌డికి, లాక్‌డౌన్ అమ‌లుకు  ఎలాంటి ప్రాతిపదిక అవలంభిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతల సమావేశంలో పాల్గొన్న సోనియాగాంధీ... ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనే దానిపై ముఖ్యమంత్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

 

లాక్‌డౌన్‌ నుంచి దేశాన్ని బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న వ్యూహం ఏమిటో అడగాలని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులను సోనియా కోరారు. వలస కార్మికుల తరలింపు విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ఆమె ఈ సమావేశంలో చర్చించారు. వారివారి రాష్ట్రాల్లో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పంజాబ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేసే అంశంలో కేంద్రం ముందుకు రావడం లేదని కూడా ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.  ఈ సమావేశంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ సహా పలువురు ముఖ్యనేతలు పాల్గొన్నారు.


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: