విశాఖపట్టణం, ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన కెమికల్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి పెరిగిపోతూనే ఉన్నాయి.  ఆర్ఆర్ వెంకటాపురంలో ముగ్గురు మృతి చెందగా, విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. బాధితులతో కేజీహెచ్ ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకై దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఆ వాసనకు కడుపులో వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు.  

 

అప్రమత్తమైన పోలీసులు సైరన్‌ మోగిస్తూ ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు. ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులు, మహిళలను ఆసుపత్రికి తరలిస్తున్నారు.   కాగా, శాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. విశాఖపట్నం పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకున్న ప్రధాని అన్ని రకాల సహాయ సహకారాలను, మద్దతు అందజేయనున్నట్లు తెలిపారు. అంతకుక్రితం విశాఖ గ్యాస్‌ లీక్‌పై ప్రధాని మోదీ హోంమంత్రిత్వ శాఖ అధికారులు అదేవిధంగా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి అధికారులతో మాట్లాడారు. 

 

దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు.  మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధిక సాయం చేయాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.  క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి.  కాలుష్య నియంత్రణ మండలి కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

 

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన రసాయన వాయువు లీకేజీ ఘటనపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. అక్కడ చోటు చేసుకున్న పరిమాణాలను వీడియోల్లో చూస్తే షాక్‌కు గురయ్యాయనని ఆయన పేర్కొన్నారు. ఈ వాయువు లీకేజీ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు కేటీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతే కాదు పలువురు రాజకీయ నేతలు ప్రగాడ సానుభూతి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: