విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయిన విషయం తెలిసిందే. గ్రామాలకు గ్రామాలను కబలించింది ఈ ఘటన. దేశాన్ని మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పాటు కు గురి చేసింది. విశాఖ నగరంలోని ఆర్ఆర్ వెంకటాపురం లో గల ఎల్జి పాలిమర్స్ అనే ప్లాస్టిక్ తయారీ కంపెనీ నుండి ఈరోజు తెల్లవారుజామున విషవాయువు వెలువడి మూడు కిలోమీటర్ల వ్యాప్తి చెందడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఏకంగా ఈ విష వాయువు గాలిలో కలిసి పోవడంతో ఈ విష వాయువులు పీల్చుకున్న ప్రజలందరూ ఎక్కడికక్కడ కుప్పకూలిపోయారు. కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్తే మరికొందరు ఏకంగా ప్రాణాలను సైతం వదిలారు. 

 

 ఈ ఘటన  ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని  మొత్తం ఉలికిపాటుకు గురిచేసింది. అయితే సమాచారం అందుకున్న పోలీసులు,  అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో ఎక్కడపడితే అక్కడ ప్రజలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి కుప్పకూలిపోయారు. రోడ్లమీద వీధుల్లో మాత్రమే కాకుండా ఇళ్లల్లో  నిద్ర పోతున్న వారు కూడా నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. దీంతో తలుపులు బద్దలు కొట్టి మరి ఇళ్లల్లో  నుంచి ప్రజలను ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. ఇక 25 అంబులెన్సులు పోలీసు వాహనాల్లో బాధితులను కేజీహెచ్ ఆస్పత్రికి తరలిస్తున్నారు అధికారులు. 

 

 ఈ క్రమంలోనే రోజు వారి విధుల్లో భాగంగా రైల్వే స్టేషన్ కి వెళ్తున్న ఒక కానిస్టేబుల్ కూడా ఈ వాయువు పీల్చి  రోడ్డుపైన కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని  కేజీహెచ్ హాస్పిటల్ కి తరలించారు. ఇక ఈ విష వాయువు నేపథ్యంలో అక్కడ కనిపించిన దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. చిన్నపిల్లలు ఈ విష వాయువుల పీల్చి నురగలు  కక్కుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో తల్లిదండ్రుల విలపిస్తున్న తీరు అందరినీ కలచివేస్తోంది. ఎక్కడ చూసినా పిట్టల్లా రాలి పోయినట్లుగా ప్రజలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి పడిపోయి ఉన్నారు. ఈ దృశ్యాలు ఎంతో మందిని కలిచి వేస్తుంది  అని చెప్పాలి. ఒకసారి ఈ కింది వీడియోలో చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి విశాఖ నగరంలో నెలకొన్నది అన్నది అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: