విశాఖ నగరం ఆర్ఆర్ వెంకటాపురం లోని  ఎల్జి పాలిమర్స్ అనే ప్లాస్టిక్ తయారీ కంపెనీ నుంచి వెలువడిన గ్యాస్ ఎంతోమందికి ప్రాణాల మీదికి తెచ్చిన విషయం తెలిసిందే. విశాఖ నగరంలో ఎన్నో గ్రామాలను కబలించింది ఎల్జీ పాలిమర్స్  కంపెనీ నుంచి వెలువడిన గ్యాస్. ఏకంగా ఈ ఘటనలో 200 నుంచి 300 వరకు ప్రజలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. అయితే ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఎల్జీ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ తయారీ కంపెనీ నుంచి విషవాయువు భారీ మొత్తంలో లీక్ అయింది. ఈ విష వాయువు చుట్టుపక్కల గ్రామాలకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందింది. 

 

 

 దీంతో చుట్టుపక్కల  గ్రామాల ప్రజలు ఈ విష వాయువు పిల్చుకొని ఎక్కడికక్కడ అపస్మారక స్థితిలోకి వెల్లి  కుప్పకూలిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు పోలీసు యంత్రాంగం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆయా గ్రామాల్లో అపస్మారక స్థితిలోకి చేరుకున్న ప్రజలను కేజీహెచ్ హాస్పిటల్ కి తరలించారు. అయితే ఈ ఘటనలో దాదాపు ఈ విష వాయువు గాలి పీల్చుకుని 200 నుంచి 300 మంది ప్రజలు అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. ముక్యంగా  చిన్న పిల్లలు మహిళలపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా చూపిందని.. ఈ విష వాయువులు పీల్చుకోగానే నురగలు  కక్కుతూ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. 

 

 

 కాగా ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తాజాగా ప్లాస్టిక్ తయారీ కంపెనీ అయిన ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసు అధికారులు. అంతేకాకుండా ఈ కంపెనీ యాజమాన్యానికి సీపీ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో భవిష్యత్తులో ఈ కంపెనీ మళ్లీ నడుస్తుంది అనే నమ్మకం కూడా లేకుండా పోయింది. సిపి వార్నింగ్ ఇవ్వడంతో ఈ కంపెనీ మూతపడటం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. అయితే కొన్ని గ్రామాల ప్రజలను ప్రాణాపాయ స్థితికి తీసుకు వచ్చిన ఈ కంపెనీ పై అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: