ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ విధానం అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనితో దేశం పూర్తిగా స్తంభించడంతో ఎక్కడి ప్రజలు అక్కడే ఉండిపోయారు. కొంత మంది ప్రజలు అయితే నీళ్లు, ఆహారం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వాలు, ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వారిని ఆదుకోవడం జరిగింది. ఇక తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలుస్తున్నారు. 

 

ఇదే దావలో... ఇటీవల విజయ్ దేవరకొండ తన స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ప్రజలకు అండగా నిలిచాడు. ఇక ఇదే తరుణంలోనే ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ కూడా చాలా మంది వలస కార్మికులకు అండగా నిలిచాడు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ లో వలస కార్మికులకు ఆశ్రయమిచ్చి వారిని ఆదుకోవడం జరిగింది. అయితే కొన్ని రోజులుగా ప్రభుత్వం వలస కార్మికులను వారి సొంత ఊర్లకు తరలిస్తున్న తరుణంలో.. ఇన్ని రోజులుగా తన ఫామ్ హౌస్ లో ఉన్న వలసకు కార్మికులను వారి స్వస్థలాలకు ప్రకాష్ రాజ్ పంపించారు...


అంతేకాకుండా వలస కార్మికులు వారి స్వస్థలానికి పంపించేందుకు అన్ని రకముల ఏర్పాట్లు చేసినందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డికి ప్రకాష్ రాజ్ కృతజ్ఞతలు తెలియజేశారు. వలస కార్మికులు అందరూ 40 రోజుల పాటు తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. వాళ్లంతా కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని ప్రకాష్ తన భావాలను వ్యక్తం చేశాడు. నిజానికి వీరి జీవిత కథల నుండి నేను చాలా నేర్చుకున్నాను అని తెలిపారు. అలాగే ఈ కష్టకాలంలో కూడా వారికి అండగా నిలిచినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది అంటూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకోవడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: