కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 40 రోజులపాటు సంపూర్ణమైన లాక్ డౌన్ కొనసాగిన విషయం తెలిసిందే. దేశ ప్రజలు ఎవరిని ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా మంచి ఉద్యోగాలు ఆఫీసులు  కార్యాలయాలు రవాణా వ్యవస్థ పూర్తిగా మూసివేశారు సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగించింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 40 రోజుల తర్వాత ఈ లాక్ డౌన్ లో  సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్ర పరిధిలో వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని సడలింపులు  ఇస్తున్నాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. 

 

 

 ఇక లాక్ డౌన్  మొదలైనప్పటి నుంచి మందు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మందుబాబులకు  అందరికీ కొత్త ఆశలు చిగురించాయి. మద్యం షాపులు ఓపెన్ కావడంతో మందుబాబులు అందరూ మద్యం షాపుల వద్ద బారులు తీరుతున్నారు. ఇక కొన్ని చోట్ల సామాజిక దూరం పాటిస్తూ మద్యం కొనుగోళ్లు జరుగుతుంటే మరికొన్నిచోట్ల సామాజిక దూరం పాటించకుండా... ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్ ఎక్సయిజ్ శాఖ  అధికారులు వినూత్న ఆలోచన చేసి కీలక నిర్ణయం తీసుకున్నారు. 

 

 

 మద్యం దుకాణాలు తెరిచుకోవడంతో ఎక్కువ మొత్తంలో ప్రజలు అక్కడికి చేరుకునే అవకాశం ఉందని దీంతో వైరస్ వ్యాప్తి కూడా పెరిగే వీలు ఉంది అని భావించిన అధికారులు.... ఈరోజు నుంచి మద్యాన్ని హోమ్ డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ టాక్సేషన్  శాఖ తెలిపింది. లిక్కర్ డెలివరీ సమయాన్ని సంబంధిత శాఖ కమిషనర్ లు నిర్వహిస్తారు అంటూ తెలిపింది. అయితే ఈ డెలివరీ కి గాను ఒక్కో ఇంటికి కేవలం రెండు లీటర్ల మద్యం  మాత్రమే అందుబాటులో ఉంటుంది అని... అంతేకాకుండా 21 ఏళ్ల వయసు దాటిన వారికి మాత్రమే మద్యం డెలివరీ చేసేలా మార్గదర్శకాలు రూపొందించిన పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ దీనిని ప్రారంభించిందని తెలిపారు అధికారులు . మద్యం షాపుల వద్ద ఎక్కువగా ప్రజలు గుమిగూడ కుండా  ఉండేందుకు  ఈ సైట్ను ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: