కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్రం లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడంతో దేశ వ్యాప్తంగా 40 రోజులకు పైగానే మద్యం దుకాణాలు క్లోజ్ అయిపోయాయి. ఇటువంటి సమయంలో ఇటీవల మూడవ దశ లాక్ డౌన్ పొడిగించిన తరుణంలో సడలింపు ల విషయంలో మద్యం దుకాణాలను ఓపెన్ చేసుకోవచ్చని కేంద్రం పర్మిషన్ ఇవ్వటం మనకు అందరికీ తెలిసినదే. దీంతో మందు కి అలవాటు పడిన ప్రాణానికి ఈ వార్త విని ఒక్కసారి వంద టన్నుల పవర్ వచ్చినట్లయింది దేశంలో ఉన్న మందుబాబులకు. నెక్స్ట్ రోజే మందు అంతా మందుల షాపుల ముందు భారీగా క్యూలైన్ లో నిలబడి ఒక్కసారిగా స్టాకు మొత్తం అయిపోయేలా కొనుగోలు చేయడం జరిగింది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సీఎం జగన్ కేంద్రం ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటన ఇవ్వటంతో పాటుగా మద్యం ధరలు 75 శాతం పెంచడంతో ఏపీ ఖజానా కి దాదాపు సుమారుగా 30 వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు అంచనా వేశారు. పెంచిన ధరలు మేరకు ఏపీ రాష్ట్ర ఖజానా కి మద్యం వల్ల దండిగా డబ్బు వచ్చింది అని అంటున్నారు.

 

చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మందుబాబులు రేటు పెంచిన గాని డబ్బులు లెక్కచేయకుండా మద్యం కొనుగోలు చేసుకోవడంతో ఖజానాకు డబ్బులు భారీగా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క జగన్ సర్కార్ రాష్ట్రంలో ఉన్న లిక్కర్ షాప్స్ తగ్గించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు 3500 లిక్కర్ షాప్ లు ఉండగా వాటిని 2934కు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తంమీద చూసుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో లిక్కర్ షాపులు 35 శాతం మేర జగన్ సర్కారు తగ్గించడం జరిగింది. అయినాగానీ మందుబాబులు భారీగా మద్యం కొనుగోలు చేయడంతో ప్రస్తుతం ఖాళీ అయిన రాష్ట్ర ఖజానా కి డబ్బులు దండిగా వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: