విశాఖలో గ్యాస్ లీకేజీ ప్రమాదం ఘటన తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. సుమారు పది మంది వరకు ఈ ఘటనలో మరణించగా, వేలాది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ లీకేజీ కారణంగా మూగజీవాలు సైతం పెద్ద సంఖ్యలో మరణించగా, దీని ప్రభావం సుమారు ఐదు కిలోమీటర్ల వరకు వ్యాపించింది. దీంతో విశాఖ లని సుమారు ఐదు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ కూడా బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే ఈ దుర్ఘటనలో మృతిచెందిన ఒక్కొక్కరికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కు కూడా జగన్ ఆదేశాలు జారీ చేశారు.

 

IHG


తాజాగా గ్యాస్ లీకేజీ ఘటనపై ఎల్జీ పాలిమార్స్ కంపెనీ స్పందించింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా కంపెనీలోని ట్యాంకులు రన్నింగ్ లో లేకపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లుగా పేర్కొంది. మొత్తం ట్యాంక్ కెపాసిటీ 2400 తన్నులుగా కంపెనీ జనరల్ మేనేజర్ మోహన్ రావు తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం 1800 టన్నుల స్టైరిన్ మోనోమర్ ఉందన్నారు. నిరంతరంగా సిస్టం లేకపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లుగా ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇన్హిబిటర్ తో కంట్రోల్ చేస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం తెలిపింది. దీనిని పూర్తిస్థాయిలో అదుపులోకి తెచ్చేందుకు కొంత సమయం పడుతుందని ,పూర్తిస్థాయిలో పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత ప్రజలంతా గ్రామాలలోకి యథావిధిగా రావొచ్చని కంపెనీ ప్రకటించింది.

 

IHG

ఇప్పటికే ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు ఈ దుర్ఘటనపై ప్రముఖులంతా స్పందించి తమ సానుభూతిని వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ,  రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిస్థితిని ఆరా తీస్తూ బాధితులకు అండగా నిలబడాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా భయాందోళనలో ఉన్న విశాఖ ప్రజలకు ఇప్పుడు ఈ గ్యాస్ సంఘటన మరింత కలవరం పుట్టిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: