బిజెపి నాయకుడు విష్ణుకుమార్ రాజు ఆగ్రహంతో వ్యవస్థ మారాలి ప్రజలు మారాలి అన్నట్టుగా కోపం తో తెగ ప్రసంగాలు చేస్తున్నారు. మామూలుగా ఆయన రాజకీయ ప్రయాణం చూస్తే..కార్మిక నాయకుడిగా ఉన్న ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. పెద్దగా కష్టపడకుండానే బిజెపి పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ 2014 ఎన్నికల టైంలో పొందుకుని టిడిపి బిజెపి మరియు జనసేన పొత్తులో భాగంగా ఏదోవిధంగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే అప్పట్లో ప్రతిపక్ష నేత జగన్ కంటే విష్ణుకుమార్ రాజు ఎక్కువగా అపోజిషన్ పాత్ర పోషించడం తో విష్ణుకుమార్ రాజు పేరు రాజకీయాల్లో మారుమోగింది. అతి తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు.

 

ఈ దెబ్బతో రెండోసారి జరిగిన ఎన్నికల్లో కూడా ఈజీగా గెలవచ్చు అని భావించిన విష్ణుకుమార్ రాజు...అదే నియోజకవర్గంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేయడంతో ఓడిపోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో గత కొంత కాలం నుండి సైలెంట్ గా ఉన్న విష్ణుకుమార్ రాజు ఇటీవల కరోనా వైరస్ కారణంగా నియోజకవర్గంలో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఓటు వేస్తారు అనుకోవడం భ్రమ అని అంటున్నారు. ప్రజల్లో మార్పులు రావాలని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

అంతేకాకుండా ఐదు సంవత్సరాలు ఎక్కడో ఉన్న వ్యక్తి ఈ  నియోజకవర్గంలో వచ్చి చేతిలో డబ్బు పెడితే చాలు ప్రజలు అతనికి ఓటేస్తారు అని పరోక్షంగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఉద్దేశించి ప్రజలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను దాని తర్వాత ఎన్నికల్లో ప్రజలు నన్ను కూర్చోబెట్టారని కోపంగా విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించడం జరిగింది. మరి గత ప్రభుత్వం అదే ప్రజలను మోసం చేస్తే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఎందుకు ఉన్నారు ? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు...ప్రజలు కరెక్ట్ గానే ఉన్నారు ముందు మీరు మారితే బాగుంటుందని ఆయన చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ లు వేస్తున్నారు జనాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: