నారా లోకేష్ ఎలాగైనా పార్టీని రాణించాలని టిడిపి పార్టీ నాయకుల నుండి కింది క్యాడర్ నుండి ఒత్తిడి వస్తుంది. కరోనా వైరస్ కారణంగా ఏపీ లో ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇతర రాష్ట్రంలో ఉండటం దేనికి అంటూ అధికార పార్టీ చేస్తున్న వ్యాఖ్యలకు నారా లోకేష్ బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చిందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. నారా లోకేష్ యాక్టివ్ గా ఉండాలని ఇప్పటి నుండి పోరాటం చేస్తే వచ్చే ఎన్నికల నాటికి టిడిపి నిలబడుతుందని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే ప్రతిపక్షంగా ఇక్కడ ఉండకుండా మరో చోట ఉంటే పని జరగదని పార్టీని ముందుకు నడిపించాలంటే సరైన సమయం ఇదే అని అంటున్నారు. చంద్రబాబు తర్వాత ఎవరు అన్న దాని విషయంలో ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది.

 

ఈ సమయంలో లోకేష్ తనని తాను ప్రూవ్ చేసుకుంటే టిడిపి క్యాడర్ మొత్తం భుజాన వేసుకుని అధికార పార్టీపై పోరాటానికి రెడీగా ఉందని టిడిపి శ్రేణులు అంటున్నాయి. ఎన్నికలలో ఓడిపోయినా గాని ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సమస్యల విషయంలో నారా లోకేష్ ప్రతిపక్ష పార్టీ తరఫున సరైన పాత్ర పోషిస్తే రాబోయే రోజుల్లో బాగా రాణించే అవకాశం ఉందని అంటున్నారు. దాదాపు 70 సంవత్సరాల కు దగ్గరగా ఉన్న చంద్రబాబు కొద్దికొద్దిగా రాజకీయంగా అలసత్వం ప్రదర్శిస్తున్న తరుణంలో లోకేష్ యాక్టీవ్ గా వ్యవహరించాలని లేకపోతే ఉన్న పార్టీ క్యాడర్ మిస్ అయ్యే ఛాన్స్ ఉందని పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు.

 

విశాఖ గ్యాస్ ఘటన అదేవిధంగా కరోనా వైరస్ ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంతో ఈ విషయంలో లోకేష్ సరైన పాత్ర పోషిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. అంతా చంద్రబాబే నడిపిస్తే వయసు మీద పడటంతో ఒత్తిడి పెరగడంతో లేనిపోని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని లోకేష్ ఈ విషయంలో ఆలోచించాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: