ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని కఠినంగా అమలు చేస్తున్నారు. ఇంటిలో అడుగు తీసి బయటకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి తరుణంలో ఇటీవల దేశవ్యాప్తంగా వలస కార్మికుల కష్టాలు చూసిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన రైలు సర్వీసులు నడిపిస్తున్నాయి. కోట్లాది మంది ప్రజలు ఎక్కడి వారు అక్కడ ఆగిపోవటంతో ఎవరు కూడా ఒకచోట నుంచి మరొక చోటుకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ప్రయాణం చేయడానికి కూడా సౌకర్యాలు లేకుండా పోయాయి. లాక్ డౌన్ అమలులో ఉండటంతో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సరిహద్దులు క్లోజ్ అవ్వడంతో పాటు రవాణా వ్యవస్థ కూడా స్తంభించడంతో మొన్నటి వరకు వలస కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పట్లో గూడ్స్ రైలు సర్వీసులు మినహా ఏమి కూడా అందుబాటులో లేదు.

 

ఇటువంటి సమయంలో ఓ ప్రేమజంట చేసిన పని దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఆ జంట మహారాష్ట్రలోని నాసిక్ వెళ్ళడానికి యూపీలోని ఆగ్రా నుండి రహస్యంగా వెళ్ళాలి అని చూసారు. గూడ్స్ రైలు రాజస్థాన్ కి చేరుకున్న తర్వాత వాళ్ళు ఇద్దరూ రైల్లో దాక్కున్నారు అని గుర్తించారు. ఢిల్లీ-ముంబై రైల్వే లైన్‌ లోని హిందౌన్ సిటీ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక క్రాసింగ్ వద్ద క్యారేజ్ కంపార్ట్‌మెంట్‌లో వాళ్ళు కూర్చున్నారు అని గేటు మాన్ ఒకరు గుర్తించారు. వెంటనే తర్వాత స్టేషన్ మాస్టర్ కి సమాచారం ఇవ్వటం జరిగింది. దీంతో నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ గూడ్స్ రైలుని ఆపేశారు.

 

జీఆర్పీ సిబ్బంది సహాయంతో ప్రేమికుల జంటను గూడ్స్ రైలులో నుంచి కిందకు దింపి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. దీంతో ఆ జంట ఎప్పటినుంచో ప్రేమించుకున్నట్లు తమది యూపీ రాష్ట్రమని దయచేసి మమ్మల్ని విడిచి పెట్టండి అంటూ పోలీసులను వేడుకున్నారు. దీంతో ఆ జంట ఏడుపు చూసిన పోలీసులు... తల్లిదండ్రులను పిలిపించి పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో వాళ్ళ ప్రేమకి స్పాట్ లో పెళ్లి చేసిన తప్పు లేదు అని నెటిజన్లు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: