కేరళలో ఈరోజు కూడా జీరో కరోనా కేసులు నమోదు కాగా 5గురు బాధితులు కోలుకున్నారు.  గత 5రోజుల్లో ఒక్క రోజు మాత్రం మూడు కేసులు నమోదు కాగా మిగిలిన నాలుగు రోజుల్లో జీరో కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 502 కేసులు నమోదు కాగా అందులో 474 మంది కోలుకొని ముగ్గురు మరణించారు. ప్రస్తుతం 25కేసులు మాత్రమే యాక్టీవ్ గా ఉన్నాయని కేరళ వాసులకుసీఎం విజయన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ 25మంది కూడా కోలుకుంటే కేరళ కరోనా ఫ్రీ స్టేట్ గా మారినట్టే. 
కేరళ లో ఇలా ఉంటే మిగితా రాష్ట్రాల్లో మాత్రం కరోనా  విజృంభిస్తుంది. తమిళనాడు లో ఈ రోజు మరో 580 కొత్త కేసులు  నమోదు కాగా ఇద్దరు మరణించారు. రాష్ట్ర  వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5409కి చేరింది. పరిస్థితి చేయి దాటిపోతున్నా ఈరోజు అక్కడ ప్రభుత్వ ఆదీనంలో నడిచే లిక్కర్ షాపులు  ఓపెన్ అయ్యాయి దాంతో మద్యం కోసం మందుబాబులు  ఎగబడ్డారు. కరోనా ను లెక్క చేయకుండా భౌతిక దూరం పాటించకుండా మద్యం కొనుగోలుకే వారు ఆసక్తి చూపించారు. ఇక ఆంద్రప్రదేశ్ లో ఈరోజు మరో 56 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 1833కు చేరింది. గ్రీన్ జోన్ గా వున్న విజయనగరం లోను తాజాగా మూడు కేసులు రావడంతో రాష్ట్రం లో ప్రస్తుతానికి  ఒక్క గ్రీన్ జోన్ జిల్లా కూడా లేకపోవడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: