గాంధీ మహాత్ముడు, గురుదేవుడు రవీంద్రనాథ్ ఠాగూల్.. ఒకరు జాతిపిత. మరొకరు విశ్వకవి.. గాంధీని మహాత్మా అన్న మొదటి వ్యక్తి రవీంద్రుడే.. రవీంద్రుడిని గురుదేవుడుగా గాంధీ పిలిచాడు. వీరిద్దరికీ ఒకరిపై మరొకరికి అచంచలమైన గౌరవం, ఆప్యాయత ఉండేవి. అయినా సిద్ధాంతాల పరంగా, అంశాలపరంగా విబేధించేందుకు వెనుకాడేవారు కాదు.

 

 

అందుకు ఉదాహరణ.. స్వదేశీ ఉద్యమం.. అప్పట్లో భారత దేశంతో పాటు జపాన్, చైనా, పశ్చిమ దేశాలలో జాతీయవాదం పెల్లుబికింది. కానీ ఆ పేరుతో మితిమీరిన చర్యలు మంచిది కాదని ఠాగూర్ గట్టిగా నమ్మారు. అప్పట్లో.. గాంధీ నాయకత్వంలోని సహాయ నిరాకరణోద్యం సమయంలో 1921 అక్టోబర్ లో "ఏ కాల్ ఆఫ్ ట్రూత్" పేరుతో ఠాగూర్ ఒక వ్యాసం రాశారు. అందులో గాంధీ చూపించే చర్కా చిహ్నం ఏ విధంగా ఆర్థికంగా భారతదేశానికి ఉపయుక్తమని నేరుగా ప్రశ్నించారు.

 

 

అంటే.. విదేశి వస్తువులను బహిష్కరించడాన్ని ఠాగూర్ తీవ్రంగా నిరసించారు. ప్రతి రంగంలో భారతీయ స్వయం సమృద్ధి యొక్క అవసరాన్ని గాంధీ నొక్కిచెప్పగా, అంతర్జాతీయ సహకారం మరియు భాగస్వామ్యం యొక్క అవసరాలు అనివార్యమని ఠాగూర్ వాదించారు. ఆధునిక యుగంలో భారతదేశం విదేశాల నుండి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నారు ఠాగూర్.

 

 

శాస్త్రసాంకేతిక రంగాల అభివృద్ధిలో పాశ్చత్య దేశాల సహకారం తప్పనిసరి అని ఆనాడే ఠాగూర్ చెప్పారు. అంతే కాదు.. అతి జాతీయ వాదం కారణంగానే రెండో ప్రపంచ యుద్ధం వచ్చిందని భావించారు. ఐరోపా దేశాలలో నెలకొన్న అతి జాతీయవాదమే ఈ ఘోరానికి కారణమని ఠాగూర్ విశ్వసించారు. నేడు రవీంద్రుని జయంతి సందర్భంగా ఈ చిన్న వ్యాసం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: