బంగ్లాదేశ్ లో ఇప్పటివరకు 12, 450 పై చిలుకు కరోనా వైరస్ కేసులు నమోదు కాగా... తాజాగా ఆ దేశంలో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తున్నారు. గురువారం రోజు ముస్లింలంతా కలిసి మసీదులకు హాజరయ్యి... ప్రార్థనలు కూడా చేశారు. కానీ మసీద్ నాయకులు ఇఫ్తార్ పండుగ రోజు ప్రార్థనలు గుంపుల సమక్షంలో ఏర్పాటు చేసేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. మసీద్ లకు హాజరయ్యే వారు తప్పకుండా భౌతిక దూరాన్ని పాటించేలా తగు చర్యలు తీసుకుంటున్నారు అక్కడి అధికారులు.


మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు మాట్లాడుతూ... ప్రార్థనలు చేసేందుకు వెళ్లిన భక్తులకు కొన్ని మార్గదర్శకాలను సూచించామని... అవి ప్రతి ఒక్కరూ పాటించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్ తమ దేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ... మార్చి 26 వ తేదీన అన్ని ప్రాంతాలలో లాక్ డౌన్ విధించింది. ఆ తర్వాత కేవలం అయిదారుగురిని మాత్రమే మసీదులలో ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఇచ్చారు. శుక్రవారం రోజు 10 మంది భక్తులు మసీదు లకు వెళ్లి ప్రార్థనలు చేసేందుకు అనుమతి ఇచ్చారు.


ప్రస్తుతం ఎక్కువ మందికి మసీదులకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ... ప్రార్థన చేసుకునేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ తమ సొంతంగా ఒక ప్రేయర్ మ్యాట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రార్థనా మందిరం లో ప్రార్థన చేసే ముందు ప్రార్ధన చేసిన తర్వాత కూడా మందిరంలోని స్థలంపై వైరస్ లను చంపే మందులను స్ప్రే చేయాల్సి ఉంటుంది. ప్రతి మసీద్ ఎదుట చేతులు కడుక్కోవటానికి ఒక కులాయి, సబ్బు కంపల్సరిగా ఉండాల్సి ఉంటుంది.


భక్తులు ఇంటి వద్ద నుండి వచ్చేటప్పుడు తప్పకుండా నీటిగా స్నానం చేసి, ప్రొటెక్టీవ్(మాస్క్) వస్తువులను ధరించాలి. ప్రతి ఒక్క భక్తి మధ్య కనీసం మూడు అడుగుల దూరం మెయింటైన్ చేయాలి. చిన్నపిల్లలు ముసలివాళ్ళు రోగగ్రస్తులు ప్రార్థన సమావేశాల్లో పాల్గొనడానికి అనుమతి లేదు. ఈ ఆంక్షలను ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపై లీగల్ గా యాక్షన్ తీసుకుంటారు అక్కడి అధికారులు. కాగా, బంగ్లాదేశ్ లో ఇప్పటివరకు 184 మంది కరోనా పీడితులను మృత్యువాత పడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: