విశాఖ‌ప‌ట్నంలో గురువారం ఉద‌యం సంభ‌వించిన గ్యాస్ లీక్ కార‌ణంగా విడుద‌లైన విష‌వాయువుతో ఇప్ప‌టికే 11 మంది ప్రాణాలు కోల్పోగా మ‌రో 3 వేల మంది వ‌ర‌కు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఇక ఈ గ్యాస్ ప్ర‌భావం గాలిలో కొద్ది గంట‌ల పాటు ఉంటుంద‌న్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ గ్యాస్ వ్య‌ర్థాల‌ను వెంట‌నే నియంత్రించ‌క‌పోతే ఆ ప్ర‌భావం మ‌రి కొంత‌మందిపై ఒక‌టి రెండు రోజుల పాటు ఉంటుంద‌ని కూడా అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ ప్ర‌మాదం సంభ‌వించిన వెంట‌నే గురువారం తెల్ల‌వారు ఝాము నుంచే వైజాగ్‌లో అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేసిన సీఎం జ‌గ‌న్ ఆ వెంట‌నే స‌మీక్ష నిర్వ‌హించి ఆఘ‌మేఘాల మీద వైజాగ్‌కు వెళ్లారు.

 

ఇక విశాఖ‌లో బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన జ‌గ‌న్ ఆ వెంట‌నే ఇక్క‌డ లీక్ అయిన స్టెరిన్ గ్యాస్‌కు విరుగుడు కెమిక‌ల్స్ కేవ‌లం గుజ‌రాత్‌లో మాత్ర‌మే ఉన్నాయ‌ట‌. ఇక ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌ల‌కు కేంద్రంగా గుజ‌రాత్ ఉంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఏపీలో ఈ గ్యాస్‌కు విరుగుడు ప‌దార్థాల‌ను గుజ‌రాత్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ఏపీకి ర‌ప్పిస్తున్నారు. ఇందుకోసం వైసీపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థిగా ఉన్న ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ప‌రిమ‌ళ్ న‌త్వానీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు స‌మాచారం. ఈ విష వాయువుల ప్ర‌భావం త‌గ్గాలంటే పారా టెరిటియరీ బ్యూటిల్ క్యాట్ థాల్ (పీటీబీసీ) కెమికల్స్ వాడాలి. ఇవి కేవ‌లం గుజ‌రాత్లో మాత్ర‌మే త‌యార‌వుతాయి.

 

ఈ క్ర‌మంలోనే సీఎం జ‌గ‌న్ సైతం గుజ‌రాత్ సీఎం విజ‌య్ రూపానీతో ఫోన్లో మాట్లాడ‌డం ఆయ‌న వాపి పారిశ్రామిక వాడ నుంచి 500 కేజీల పారా టెరిటియ‌రీ బ్యూటిల్ క్యాట్ థాల్ కెమిక‌ల్‌ను రోడ్డు మార్గంలో డామ‌న్‌కు త‌ర‌లించ‌గా.. అక్క‌డ నుంచి వీటిని ప్ర‌త్యేక విమానంలో విశాఖ‌కు తీసుకు రానున్నారు. అక్క‌డ నుంచి విటిని విష‌య‌వాలు ఉన్న ప్రాంతాల్లో వెద‌జ‌ల్లితే ఆ విష‌వాయువు నాశ‌నం అవుతుంది. అలాగే హెలీకాఫ్ట‌ర్ ద్వారా స‌ముద్ర‌పు నీటిని సైతం ఈ వాయువుపై వెద‌జ‌ల్లితే దాని ప్ర‌భావం నిశిస్తుంద‌ట‌. ఏద‌మైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌క్ష‌ణ‌మే తీసుకున్న ఈ చ‌ర్య‌లు విశాఖ‌లో న‌ష్టాన్ని చాలా త‌గ్గించాయ‌నే చెప్పాలి. ఉద‌యం ర‌సాయ‌న ప్ర‌భావం తీవ్రంగా ఉన్న‌ టైంలో వైద్యులు, నిపుణులు సైతం ఏం చేయాలో తెలియ‌ని ఆందోళ‌న‌లో ఉంటే వెంట‌నే జ‌గ‌న్ గుజ‌రాత్ సీఎంతో మాట్లాడి హెలీకాఫ్ట‌ర్ ద్వారా పీటీబీసీ ఏపీకి ర‌ప్పించ‌డం తార్కిక ఆలోచ‌న‌కు నిద‌ర్శ‌నం.
 

మరింత సమాచారం తెలుసుకోండి: