విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి వెలువడిన విష వాయువులు పది మందికిపైగా ప్రాణాలు తీసేశాయి. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది. ఇందులో ఎవరి తప్పు ఏంటి.. మానవ తప్పదిమా.. సంస్థ నిర్లక్ష్యమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే విషపూరితమైన స్టెరీన్ గ్యాస్ ని నిల్వ చేయడంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సిబ్బంది చూపిన నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.

 

 

అసలు విషయం ఏంటంటే.. ఎల్జీ పాలిమర్స్ సంస్థ.. పాలీస్టెరీన్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకు అవసరమైన ముడి సరుకును విదేశాల నుంచి తెప్పించుకుంటుంది. అయితే.. ఈ కంపెనీ ఈ ముడి సరుకును తక్కువ క్వాంటిటీల్లో కాకుండా బల్క్ గా తెప్పించుకోవడం ద్వారా రవాణా ఖర్చును తగ్గించుకుంటోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇలా బల్క్ లో స్టెరీన్ ను తెచ్చుకున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

 

 

కానీ అలాంటి సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే.. ఇంత ప్రమాదం జరిగిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రవాణా ఖర్చును తగ్గించుకోవడం ఒక కక్కుర్తి అయితే.. లాక్ డౌన్ సమయంలో పరిశ్రమలో మెయింటైన్స్ విషయంలో తగిన జాగ్ర్తత్తలు తీసుకోకపోవడం సిబ్బంది నిర్లక్ష్యంగా చెప్పుకోవాలి.. అటు సంస్థ కక్కుర్తి.. ఇటు సిబ్బంది నిర్లక్ష్యం వెరసి జనం ప్రాణాలు హరించాయి.

 

 

ఇక ఈ కంపెనీ విషయానికి వస్తే.. విశాఖ శివార్లలోని పాలిమర్స్ కంపెనీని 1997లో ఆర్ ఆర్ వెంకటాపురం గ్రామంలో నెలకొల్పారు. హిందుస్ధాన్ పాలిమర్స్ గా తొలుత ఉన్న ఈ కంపెనీ తర్వాత కాలంలో ఎల్జీ పాలిమర్స్ గా మారింది. 213 ఎకరాల విస్తీర్ణంలో 168 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సంస్థ ప్రారంభమైంది. ఈ కంపెనీ ప్రతిరోజూ 417 టన్నుల పోలీస్టెరీన్‌ను ను ఉత్పత్తి చేస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: