ఏపీకి ఇబ్బందులు మీద ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కరోనా వల్ల రాష్ట్రం పలు సమస్యలని ఎదురుకుంటుంది. లాక్ డౌన్ తో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. అయినాసరే సీఎం జగన్ ప్రజలకు ఎప్పుడు అండగానే ఉంటున్నారు. పరిస్థితి బాగోకపోయినా సరే ప్రజలకు ఎలాంటి లోటు రానివ్వడం లేదు. అయితే ఇన్ని ఇబ్బందుల్లో కూడా జగన్ ధైర్యంగా ముందుకెళుతున్నారు.

 

ఇక ఇలాంటి సమయంలోనే విశాఖ గ్యాస్ లీకేజ్ జరగడం, 10 వరకు చనిపోవడం, వందలాదిమంది అస్వస్థతకు గురి కావడం జరిగాయి. ఈ విషయంలో కూడా జగన్ ధైర్యంగా ముందుకు వెళ్లి, బాధితుల్ని పెద్ద మనసుతో ఆదుకున్నారు. అయితే ఈ విషయమేమి పట్టించుకోని టీడీపీ మాత్రం, గ్యాస్ లీకేజ్ వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయని వెతికే పనిలో పడ్డారు.

 

అత్యవసర వస్తువులు తయారు చేసే కంపెనీలకు మాత్రమే ఉన్న అనుమతి విశాఖ ఎల్జీ పాలీమర్స్‌కు ఎలా వచ్చిందో  అని వర్ల రామయ్య లాంటి వారు ప్రశ్నిస్తున్నారు. ప్లాస్టిక్ సామానులు అత్యవసరం కాదని.. కానీ ఆ కంపెనీ విశాఖ నాది అని చెప్పుకుంటున్న ఓ అధికార పార్టీ నాయకుడు ఆ కంపెనీకి అనుమతి ఇప్పించారని వర్ల ఆరోపించారు.

 

అయితే ఇక్కడ అలాంటి సంస్థలకు ఎలా అనుమతి వచ్చిందనే ప్రశ్న బాగానే ఉన్నా, ఆ అనుమతి ఇచ్చింది ఓ వైసీపీ నేత అని మాట్లాడటంలో మాత్రం లాజిక్ కనబడటం లేదు. ఆయన పరోక్షంగా విజయసాయిరెడ్డినే అనుమతి ఇచ్చారంటూ మాట్లాడారు. ఎందుకంటే విశాఖలో వైసీపీని నడిపించేది ఆయనే. 2014 ఎన్నికల తర్వాత నుంచి విజయసాయి విశాఖ కేంద్రంగా పార్టీ గెలుపుకు కృషి చేసారు. ఇప్పుడు కూడా ఆయన అక్కడ కీలకంగా ఉన్నారు.

 

పైగా మూడు రాజధానులు ఏర్పాటు చేయడంలో భాగంగా విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావడంలో ఆయన పాత్రే మెయిన్ అనే ప్రచారం కూడా ఉంది. దీంతోనే ఆ కంపెనీకి విజయసాయినే పర్మిషన్ ఇచ్చారని వర్ల పరోక్షంగా విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: