అమెరికాలోని భార‌తీయ నిపుణుల‌కు తీపిక‌బురు. వీసాలను పొందడానికి నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు వాటి విష‌యంలో నూత‌న ప్ర‌తిపాద‌న‌లు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయంలో ఆయ‌న‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. హెచ్‌–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు (భర్త లేదా భార్య) హెచ్‌–4 వీసాలను మంజూరు విష‌యంలోనూ ట్రంప్ కత్తి క‌ట్టగా దానిపై కోర్టు షాక‌య్యే తీర్పు ఇచ్చింది.  హెచ్–4 వీసా హోల్డర్‌ల‌ వర్క్ పర్మిట్లను బ్లాక్ చేయవద్దని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టును డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కోరింది. 

 

హెచ్ 1 బి వీసాలు కలిగిన వారి జీవిత భాగస్వాములకు హెచ్‌4 ద్వారా వర్క్ ఆథరైజేషన్ లభిస్తుంది. విదేశాలకు చెందిన ప్రొఫెషనల్స్, ఇంజినీరింగ్ నిపుణులు అమెరికాలో పని చేసేందుకు హెచ్ 1 బి వీసాను జారీ చేస్తారు. దాంతోపాటు వారి భార్యలకు గానీ, లేదా ఇతర సమీప బంధువులకు గానీ హెచ్ 4 వీసాలు ఇస్తారు. ఒబామా హయాంలో అమలైన ఈ హెచ్ 4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్టును.. ట్రంపు సర్కారు ఎత్తేయాలని నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై ప‌లువురు న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. తాజాగా వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ కోర్టులో డిపార్ట్​మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ రిపోర్టు సబ్మిట్ చేసింది. ఈ సంద‌ర్భంగా హెచ్–4 వీసా హోల్డర్‌ల‌ వర్క్ పర్మిట్లను బ్లాక్ చేయవద్దని ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టును డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కోరింది. వారి వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు ఎలాంటి సమస్య లేదని తెలిపింది.

 

మ‌రోవైపు, హెచ్-4 వీసాల విష‌యంలో గ‌తంలో ఓ ఆస‌క్తిక‌ర నివేదిక వ‌చ్చింది. మొత్తం హెచ్‌4 వీసాల్లో భారతీయులకే అత్యధికంగా దక్కాయని ఈ నివేదికలో స్ప‌ష్టమైంది. హెచ్-4 వీసా పొందిన వారిలో ఐదింట ఒక వంతు మంది కాలిఫోర్నియాలోనే పనిచేస్తున్నట్టు తెలిపింది. హెచ్-4 వీసా కింద పనిచేసేందుకు అనుమతి పొందినవారిలో మహిళలే 93 శాతం మంది ఉన్నారని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: