గత  రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ అంశం హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఓ గాసిప్ వెబ్సైట్ విజయ్ దేవరకొండ కు సంబంధించి తప్పుగా వార్తలు  రాయడం తో ఏకంగా ఆ ఫేక్ న్యూస్ గాసిప్  వెబ్సైట్ కి వార్నింగ్ ఇస్తూ 20 నిమిషాల వీడియో చేస్తూ గట్టిగానే క్లాస్ పీకాడు విజయ్ దేవరకొండ. గాసిప్  వెబ్సైట్ విజయ్ గురించి రాసిన ప్రతి ఒక్క పాయింట్ ని తెరమీదికి తెస్తూ  ఏకి పారేశారు విజయ్ దేవరకొండ. అంతే కాకుండా ఫేక్ న్యూస్ రాసే అన్ని వెబ్ సైట్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. 

 


 అయితే విజయ్ దేవరకొండ ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండకి అంత మంది అభిమానులు ఉండడానికి కారణం కూడా అదే. విజయ్ దేవరకొండ మాటలు ఎక్కువగా యువతను ఆకర్షిస్తూ ఉంటాయి. ముక్కుసూటిగా మాట్లాడుతూ ఏది దాచుకోకుండా మాట్లాడుతూ ఉంటాడు విజయ్ దేవరకొండ. ఇక ఫేక్ గాసిప్  వెబ్సైట్ గురించి కూడా అలాగే ముక్కు సూటిగా మాట్లాడి  ఎడాపెడా వాయించేసాడు విజయ్ దేవరకొండ. మా మీద వార్తలు రాసుకుని డబ్బులు సంపాదిస్తూ మమ్మల్ని చెడ్డగా చూపిస్తారా అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 

 


 అయితే విజయ్ దేవరకొండ ఈ వీడియో విడుదల చేయాగానే  విజయ్ దేవరకొండ కు మద్దతుగా టాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా  మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దాదాపు 50 మంది టాలీవుడ్ సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ కు మద్దతు తెలిపారు.అయితే టాలీవుడ్ ప్రముఖులందరిని ఒక్కతాటి పైకి తేవటంలో విజయ్ విజయం సాధించాడు.  ఇలాంటి ఫేక్ న్యూస్ వెబ్సైట్ల పై చర్యలు తీసుకోవాలని తెలిపారు. అయితే ఇలాంటివి  కేవలం పాటలకు మాత్రమే పరిమితమైతే బాగోదని చేతులు కూడా చేపడితే మరోసారి ఇలాంటి ఫేక్ న్యూస్ రాయడానికి భయపడతారు అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఈ మేటర్ ఎక్కడ వరకు వెళుతుందో...?

మరింత సమాచారం తెలుసుకోండి: