కరోనా వైరస్ విషయంలో పగడ్బందీగా జగన్ వ్యవహరిస్తున్న తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశవ్యాప్తంగా జాతీయ నేతల్లో అతి తక్కువ కాలంలోనే తనకంటూ సపరేట్ క్రేజ్ మార్పు ఉండేలా ఏపీలో పరిపాలన ఉండటం విశేషం. కరోనా వైరస్ రాకముందే దేశవ్యాప్తంగా బెస్ట్ సీఎం లో 3 స్థానాన్ని జగన్ దర్శించుకోవడం జరిగింది. అయితే కరుణ వైరస్ రావడంతో ప్రపంచంలో ఎప్పుడు ఎన్నడు ఈ విధమైన విపత్కర పరిస్థితిని ఎదుర్కొని ప్రభుత్వాలు మరియు అగ్రరాజ్యాలు చేతులెత్తేసిన తరుణంలో ఏపీలో జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. విదేశాలనుండి వచ్చిన వారిని గుర్తుపట్టడం లో సచివాలయ సిబ్బంది ని గ్రామ వాలంటీర్ లను ఉపయోగించుకుని జగన్ వ్యవహరించిన తీరు అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

 

ఢిల్లీ మత ప్రార్థనల వల్ల ఒక్కసారిగా కరోనా వైరస్ కేసులు ఎక్కువ కావడంతో ఏపీలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థను ఏ విధంగా తీసుకువచ్చి హైలెట్ అయ్యారో తాజాగా జాయింట్ కలెక్టర్ వ్యవస్థలలో సరికొత్త ఆలోచనలతో దూసుకుపోతున్నారు. పూర్తి మేటర్ లోకి వెళితే ప్రతి జిల్లాకు ఇప్పటివరకు ఇద్దరు జాయింట్ కలెక్టర్ ఉండగా తాజాగా మూడో జాయింట్ కలెక్టర్ ఉండేలా పోస్టులు మంజూరు చేశారు. మొదటి జాయింట్ కలెక్టర్ కు రైతు భరోసా, రెవెన్యూ బాధ్యతలు ఇస్తారు. సీనియర్ ఐఏఎస్‌ అధికారిని నియమిస్తారు.

 

గ్రామ, వార్డు సచివాలయాలను పర్యవేక్షించే జేసీ పదవిని కొత్తగా సృష్టించారు. సీనియర్ టైమ్ స్కేల్ ఐఏఎస్‌ అధికారితోనే భర్తీ చేస్తారు. మూడో జేసీ ఆసరా పథకాన్ని పర్యవేక్షిస్తారు. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ కేడర్‌ అధికారిని నియమిస్తారు. పాలనలో తనదైన ముద్ర వేసేందుకు.. జగన్మోహన్ రెడ్డి.. వ్యవస్థల్ని మారుస్తున్నారు. దీనిపై ఆయన ఐడియా దేశ స్థాయిలో హైలెట్ అవటంతో మోడీ ఈ విషయాన్ని తెలుసుకుని జగన్ ని మెచ్చుకున్నట్లు సమాచారం. ముందు నుండి వ్యవసాయరంగానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే జగన్ తాజాగా ఈ విషయంలో జాయింట్ కలెక్టర్ నియమించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా ఎంతగానో సంతోష పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: