మామూలుగా కొంతమంది వ్యక్తులు చేసే వెదవ పనులు ఎందుకు చేస్తుంటారు అన్నది అర్థం కాని పరిస్థితి నెలకొంటోంది. మామూలుగా అయితే శత్రువులపై ఎప్పుడైనా పగ  తీర్చుకోవడానికి కొన్ని చర్యలు చేపడుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం కొంతమంది దేశాన్ని నాశనం చేయాలనుకున్నారా...  ఇంకేమైనా అనుకున్నారా తెలియదు కానీ దారుణానికి ఒడి గట్టారు అని చెప్పాలి.ఏకంగా ఓ నదిలో   విషాన్ని కలిపారు ఇక్కడ ఇద్దరు ప్రబుద్ధులు. కర్ణాటకలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని పల్గుణి  నదులో .. ఇద్దరు వ్యక్తులు విషం  తెలిపారు.

 

 అయితే పల్గొని  నదిలో విషం  కలిపినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించి వెంటనే అరెస్టు చేశారు. మహమ్మద్ హనీఫ్ మహ్మద్ ఈర్ష అనే  ఇద్దరు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరు నదిలో విషయం కలపడానికి గల కారణం ఏమిటి అన్నది తేలాల్సి ఉంది. మామూలుగా అయితే ఆ నదిలోని నీటిని మంచినీటిగా వాడుతూ ఉంటారు అక్కడి ప్రజలు. మరికొంతమంది పొలాలకు సాగునీరు గా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా అయితే తాగునీటికి ఎక్కువగా ప్రజలు ఈ నది పై ఆధార పడుతూ ఉంటారు. 

 

 అయితే తాజాగా ఆ నదిలో పైన చేపలన్ని  కూడా ఒక తెట్టగా  వచ్చేయడం.. అందులో  ఉండే జలచరాలన్ని  పైన తేలుతూ రావటం జరిగింది . మొన్నటి నుంచి నిన్నటి వరకు జలచరాలన్ని  ఇలా నీటి మీద తేలుతూ కనిపించింది. మామూలుగా అయితే పారిశ్రామిక కాలుష్యం కారణంగా అలా జలచరాలు  చనిపోతు  ఉంటాయి. కానీ ఇక్కడ ఫల్గుణి నదికి  దగ్గరలో ఎలాంటి కాలుష్యం లేదు. ఒకవేళ నదిలో కాలుష్యం అంటే ఇంతకుముందు కూడా ఇలా జలచరాలు చనిపోయి ఉండాలి... కానీ మొదటిసారి ఒక్కసారిగా ఇలా జల  చరాలన్ని చనిపోవడంతో ఏం జరిగింది అనేది అక్కడ నీటిని పరీక్షిస్తే నీళ్లలో విషయం కలిపింది  అనేటువంటి నిజం నిర్ధారణ అయింది. ఇక ఈ విషం  ఎవరు కలిపారు అన్నటువంటిది అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు పోలీసులు. ఆ తర్వాతఆ  ఇద్దరు వ్యక్తులను  నిర్ధారించుకుని అరెస్ట్ చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: