ప్రపంచాన్ని మొత్తాన్ని  వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. Ee క్రమంలోనే ఇజ్రాయిల్ దేశం ఒక ప్రకటన చేసింది. యాంటీ బాడీ కి సంబంధించినటువంటిది  తాము కనుకుంటున్నాము అంటూ ప్రకటన చేసింది. అంటే కరోనా వైరస్ను నిరోధించగలిగే కణం  ఏదైతే ఉంటుందో దానిని అభివృద్ధి చేసి పూర్తిగా కరోనా ను  నియంత్రించే  విధంగా చేయడం. తద్వారా కరోనా  వైరస్ ను కంట్రోల్ చేస్తామని ఇజ్రాయిల్ చెబుతుంది . ఇక తాజాగా ఇదే ప్రయోగాన్ని ఉత్రేజెడ్   యూనివర్సిటీ కూడా ప్రకటించింది. యూనివర్సిటీ లో ఉన్నటువంటి ఎరాస్మస్ మెడికల్ సెంటర్ హార్బర్ బయో మెట్ శాస్త్రవేత్తలు ఈ యాంటీ బాడీ టెస్ట్ లు  చేస్తున్నాము అని ప్రకటించారు. 

 


 కరోనా  వైరస్ చికిత్సలో ఇది ఒక కీలక అడుగు అంటూ వ్యాఖ్యానించారు అక్కడి శాస్త్రవేత్తలు. సార్ కోన్ 2 లోని ఒక కణాన్ని  పట్టుకొని వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటామని   శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ యాంటీ బాడీ కి క్రాస్ యూటిలైజింగ్  గుణముందని.. ఇది కరోనా ను  అడ్డుకోవటంలో  కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. సార్స్ కోన్ 1 యాంటీ  బాడీ లను ఉపయోగించి సార్ కోన్  2 అడ్డుకునేటువంటి వ్యాధి నిరోధక  కణాలను తమ పరిశోధనలో గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

 

హెచ్పిఎం చైర్మన్ డాక్టర్ జింగ్ పాంగ్  కూడా కరోనా  ను అడ్డుకునే క్రమంలో జరుపుతున్న పరీక్షల్లో ఇది ఒక ముందడుగు అని.. త్వరలో యాంటీబాడీ కరోనా  వైరస్ తీవ్రత శరీరంలో ఏ మేరకు కట్టడి చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి పరిశోధనలు చేయాలని చెబుతున్నారు . తమ భాగస్వాములతో కలిసి ఈ పరిశోధనలు ముందుకు తీసుకెళ్తామని వారు తెలిపారు. అంటే ఓ పక్కన ప్రయోగాలు వ్యాక్సిన్ కనుగొనేందుకు జరుగుతున్న నేపథ్యంలో.. ఇలాంటి ముందడుగు వేసి  కరోనా ను అడ్డుకునేందుకు ప్రయత్నించడం అందరికి ఆశ కిరణంగా  అవుతుంది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: