తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఎక్కడ తెరవని పరిస్థితి ఏర్పడింది అన్న దాని గురించి ఇటీవల మీడియా సమావేశంలో చెప్పారు. తెలంగాణకు నలువైపులా వేరే రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు స్టార్ట్ అవడంతో అక్కడి నుండి తెలంగాణలోకి మద్యం వస్తుందని 80% ప్రాంతాలకు మద్యం అందుతుందని అలాంటప్పుడు మద్యం దుకాణాలు క్లోజ్ చేయడం లో అర్థం లేదని తనదైన శైలిలో కేసీఆర్ చెప్పుకొచ్చారు. కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవని సమయంలో సరిహద్దులు దాటి మన రాష్ట్రానికి చెందిన జనాలు ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసినట్లు వస్తున్న వార్తలు వాస్తవమని తెలిపారు.

 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణాలు స్టార్ట్ చేస్తే...తమిళనాడు రాష్ట్రం నుండి చిత్తూరు జిల్లాకు పెద్ద ఎత్తున మందుబాబులు లైన్ కట్టడం జరిగింది. దింతో ఏపీకి బాగా ఆదాయం వచ్చింది. అయితే మద్యం అమ్మకాల విషయంలో కే‌సి‌ఆర్ చుట్టుపక్కల రాష్ట్రాలకు దిమ్మతిరిగిపోయే విధంగా భలే స్కెచ్ వేశారు. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 శాతం మద్యం ధరలు పెంచేశారు. మందుబాబులు లబోదిబోమంటున్న గాని అక్కడి ప్రభుత్వం వాళ్ళ మాటలు పట్టించుకోవడం లేదు.

 

అయితే ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే తక్కువగానే మద్యం లభించే విధంగా కే‌సి‌ఆర్ ధరలు నియంత్రించడంతో తెలంగాణ రాష్ట్రానికి మద్యం విషయంలో ఏపీ నుండి ప్రజలు కొనుగోలు కి వెళ్లడంతో కే‌సి‌ఆర్ రాష్ట్ర ఖజానా కి భారీ స్థాయిలో ఆదాయం వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఏపీలో పిచ్చి పిచ్చి బ్రాండ్స్ ఉండటంతో తెలంగాణలోనే అలా కాకుండా పేరు ఉన్న బ్రాండ్స్ అందుబాటులోకి అందుబాటులో ఉంచటంతో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి మద్యం కొనుగోలు విషయంలో పోటెత్తుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: