గురువారం విశాఖ లో దారుణ ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఎల్జి పాలిమర్స్ అనే ప్లాస్టిక్ తయారీ కంపెనీ నుంచి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గ్యాస్ భారీ మొత్తంలో లీకవడంతో  చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల వరకు వ్యాపించడంతో ఏకంగా అక్కడి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఉలికిపాటుకు గురిచేసింది అన్న విషయం తెలిసిందే. దేశంలో దిగ్భ్రాంతి నింపింది ఈ దుర్ఘటన. తెల్లవారగానే సూర్యుని చూస్తాము అనుకున్న పల్లె ప్రజలు... ఈ విష వాయువు కారణంగా నిద్రలోనే మరణించిన వారు కూడా ఉన్నారు. ఎంతో మంది జీవితాలను కకలావికలం  చేసిన ఈ దుర్ఘటన ఎంతో మందిని కలిచి వేసింది. 

 

 

 అయితే తెల్లవారుజామున మూడు గంటల సమయంలో విష వాయువు ప్రమాదవశాత్తు భారీ మొత్తంలో ఎల్జీ పాలిమర్స్ అనే కంపెనీ నుంచి లీక్ అయింది. అయితే కంపెనీలలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు... ప్రమాద సూచికగా ఒక సైరెన్  మోగుతుంది అనే విషయం తెలిసిందే. కానీ ఎల్జి పాలిమర్స్ కంపెనీ నుంచి ఈ విషవాయువులు లీక్ అయినప్పటికీ ఎలాంటి సైరన్  రాలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే దీని దుర్వాసన ఆయా చుట్టుపక్కల గ్రామాలకు వచ్చినప్పటికీ రోజూ వచ్చే వాసన కదా అని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దీనిని తేలికగానే తీసుకున్నారని... ఇక ఈ వాసన భరించలేని మరికొంతమంది ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు.. 

 

 

 ఈ క్రమంలోనే ఇళ్లలోకి కూడా  ఈ విషయమై ప్రవేశించడంతో తలుపులు వేసుకున్న  వారంతా పిల్లలే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను అంటూ తెలిపారు. ఇక ఇలా ఇళ్ళల్లో ఇరుక్కుపోయిన వారిని రక్షించడానికి ప్రత్యేక దళాలు ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది అంటూ తెలిపారు. అయితే తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఒక వేళ సైరెన్ మోగి  ఉంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ ఒక్కసారిగా అప్రమత్తం అయ్యే వాళ్ళని అప్పుడు ఇంత ప్రాణనష్టం గాని.. లేదా ఇంతమంది ప్రాణాపాయ స్థితికి వెళ్లేవారు కాదు అంటూ చెబుతున్నారు స్థానికులు. అంత పెద్ద కంపెనీలో సైరన్ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుందా లేదా అని పర్యవేక్షించకపోవటం  నిర్లక్ష్యానికి నిదర్శనం అంటున్నారు. సైరెన్  మోగకకపోవడంపై అటు సీఎం జగన్ కూడా విస్మయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: