గత 40 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం బోసిపోయిన విషయం తెలిసిందే. కరోనా  వైరస్ విజృంభణ దృశ్య తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్  అమలు చేసింది.ఈ నేపథ్యంలో ఏ దుకాణ సముదాయం కూడా తెరుచుకోలేదు. పార్కులు పబ్లిక్ ప్లేస్ లు అన్నీ మూతపడ్డాయి. చిన్న దుకాణాలు పెద్ద దుకాణాలు అనే తేడా లేకుండా.. అన్ని మూసివేయబడ్డాయి. దీంతో ఎప్పుడూ రద్దీగా కనిపించే ప్రాంతాలు కూడా జనాలు లేక బోసిపోయాయి. ఎప్పుడూ నిండుగా కనిపించే వివిధ దుకాణాలు కూడా లేకపోవడంతో పూర్తిగా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా మారిపోయినట్లు గా కనిపించింది. 

 

 

 కానీ దాదాపు 40 రోజుల తర్వాత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కళకళలాడుతోంది. కరోనా  వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఆరెంజ్ జోన్ లలో పలు  సడలింపులు  ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో గ్రీన్ ఆరెంజ్ జోన్ లోని పలు పట్టణాలు పల్లెల్లో జనసంచారం మొదలైంది. అంతేకాకుండా అన్ని దుకాణాలు తెరుచుకోవడం కూడా మొదలయ్యాయి.. రెడ్ జోన్ లో  ఉన్న జిల్లాలు మినహా మిగతా అన్ని పట్టణాలు పల్లెల్లో కూడా కార్యకలాపాలు మొదలు అయిపోయాయి. గృహ ఉపకరణాల దగ్గర నుంచి మొబైల్ దుకాణాల వరకు అన్ని తెరుచుకున్నాయి. దాదాపుగా 50 శాతం దుకాణాలు తెరిచుకోవడంతో మళ్లీ సందడి మొదలైంది. ఇక ఇన్ని రోజుల వరకు కేవలం ఇంటికే పరిమితమై ఎలాంటి కొనుగోలు చేయని  జనాలు కూడా ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు రోడ్డెక్కారు. 

 

 

 దీంతో రోడ్లపై జనసంచారం కూడా ఎక్కువైపోయింది. ఇక సాయంత్రం వరకు దుకాణాల సముదాయాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సాయంత్రం వరకు ఈ హడావిడి కొనసాగుతోంది. అయితే మామూలుగా కొంతమంది అవసరం ఉండి రోడ్ల మీదికి వస్తే ఇంకొంతమంది అవసరం లేకున్నప్పటికీ రోడ్ల మీదికి వస్తున్నారు. ఇక మొదటి రోజు తో పోలిస్తే గురువారం రోజు మద్యం షాపుల వద్ద చాలా మటుకు రద్దీ తగ్గింది అనే చెప్పాలి. ఇక నిబంధనలు పాటించని హెయిర్ సెలూన్లను  వెంటనే మూసివేయించారు అధికారులు. మరోవైపు రిజిస్ట్రేషన్ రవాణాశాఖ సేవలు కూడా బుధవారం నుంచి మొదలయ్యాయి  రిజిస్ట్రేషన్లు కూడా ప్రస్తుతం క్రమక్రమంగా పెరిగి పోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: