ప్రపంచంలో చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన మాయదారి కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తుంది.  ముఖ్యంగా అమెరికా లాంటి అగ్ర రాజ్యం లో కరాళనృత్యం చేస్తుంది.  ఇప్పటికే 60 వేల మందికి పైగా మరణించారు.  ఇక ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ పరిస్థితి కూడా అంతే.  ఇప్పుడు ఈదే బాటలోకి రష్య చేరింది.  నిన్నమొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న రష్యా ఇప్పుడు కరోనా మహమ్మారి బారినపడి అతలాకుతలం అవుతోంది. వైరస్‌ను కట్టడి చేశామని సంబరపడిన ఆ దేశ ప్రజల ఆనందం అంతలోనే ఆవిరైంది.  రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్‌ మిషూస్టిన్, సాంస్కృతిక మంత్రి ఓల్గా లూంబిమోవాస్, గృహనిర్మాణ మంత్రి వ్లాదిమర్‌ యకుషేవ్‌లును కూడా వైరస్ వదల్లేదు. ప్రస్తుతం వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 

గత వారం పదిరోజులుగా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రష్యా ప్రధానమంత్రితో స‌హా..ఒక‌రిద్ద‌రు మంత్రులు కూడా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే కరోనా వైరస్ నియంత్రణకు అన్ని దేశాల కంటే ముందే తేరుకున్నప్పటికీ లాక్‌డౌన్ విషయంలో ఆలస్యం చేయడమే ఇప్పుడు కేసులు పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతుంది.   రోజురోజుకు వందల సంఖ్యతో పెరుగుతున్న కేసులతో రష్యా ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో జర్మనీ, ఫ్రాన్స్‌లను కూడా దాటేసింది. అధ్యక్షుడు పుతిన్ అధికార కాంక్షే రష్యా ప్రస్తుత దుస్థితికి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి.

 

2036 వరకు తానే అధ్యక్షుడిగా కొనసాగాలన్న ఆరాటంతో మిగతా విషయాలను గాలికి వదిలేసిన పుతిన్ రాజ్యాంగ సవరణ విషయంలో బిజీగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  రోజురోజుకు వేలసంఖ్య‌లో‌ పెరుగుతున్న కేసులతో రష్యా ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో జర్మనీ, ఫ్రాన్స్‌లను కూడా దాటేసింది. దేశ్యాప్తంగా ఇప్పటి వరకు 1,77,160 కరోనా కేసులు నమోదు కాగా, ఇందులో సగానికి పైగా కేసులు ఒక్క రాజధాని మాస్కోలోనే నమోదయ్యాయి. 1,625 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భయపడుతున్న ప్రజలు మాస్కోను వీడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: